అల్లు అర్జున్ పాత్రలో బాలయ్య సినిమా ?

By iDream Post Oct. 28, 2020, 04:25 pm IST
అల్లు అర్జున్ పాత్రలో బాలయ్య సినిమా ?

వచ్చే నెల బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో అడుగు పెట్టబోతున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత చేయబోయే ప్రాజెక్టులకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే తన స్వీయ దర్శకత్వంలో మొదలుపెట్టి ఆపేసిన నర్తనశాల సినిమాను పావు గంట ఫుటేజీగా ఏటిటిలో విడుదల చేసిన బాలయ్య త్వరలో ఒక చారిత్రాత్మక పాత్ర చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అది గతంలో అల్లు అర్జున్ పోషించినదే కావడం గమనార్హం. అదే గోనగన్నారెడ్డి క్యారెక్టర్. రుద్రమదేవి సినిమాలో క్యామియో తరహాలో బన్నీ చేసిన ఈ పాత్ర ప్రశంసలతో పాటు అవార్డులు కూడా తెచ్చింది. గమ్మునుండవో డైలాగు బాగా ప్రాచుర్యం పొందింది.

కానీ అది రుద్రమదేవి కథ కావడంతో గోనగన్నారెడ్డి కు దర్శకుడు గుణశేఖర్ ఎక్కువ లెన్త్ పెట్టలేకపోయారు. అనుష్కనే హై లైట్ అయ్యింది. అయితే గోనగన్నారెడ్డి చరిత్రకు సంబంధించి ఎక్కువ ఆధారాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం దీన్ని రీసెర్చ్ చేసేందుకు బాలయ్య ఓ టీమ్ ని సెట్ చేసినట్టు తెలిసింది. గౌతమిపుత్ర శాతకర్ణి విషయంలో ఇలాంటి ఇబ్బందే తలెత్తినప్పుడు ఏదో మేనేజ్ చేశారు కానీ ఫైనల్ గా ఆయన చరిత్రను సంపూర్ణంగా చూపలేదని కామెంట్స్ వచ్చాయి. ఈ వాస్తవాన్ని బాలయ్యే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు కూడా. కానీ ప్రతిసారి ఆలా చేయలేము.

అందుకే గోనగన్నారెడ్డి స్క్రిప్ట్ లో అలాంటి పొరపాట్లు జరక్కుండా చూస్తున్నారట. అయితే ఇదంతా అధికారికంగా బయటికి వచ్చిన ప్రకటన కాదు కానీ బాలయ్య దీని మీద ఆసక్తి చూపుతున్న మాట వాస్తవం. గత ఏడాది ఇదే తరహాలో చిరంజీవి సైరా నరసింహారెడ్డి చేసినప్పుడు ఆశించినంత గొప్ప ఫలితాన్ని అందుకోలేకపోయారు. కొన్ని తప్పిదాలు జరిగినట్టు చెప్పినవాళ్లు లేకపోలేదు. గోనగన్నారెడ్డిని అలా చూపిస్తే ప్రయోజనం ఉండదు. మరి బాలకృష్ణ అంతా పక్కాగా కుదిరితేనే ఈ సినిమా చేస్తారా లేక ఆలోచన వరకే పరిమితమవుతారా వేచి చూడాలి. ఓకే అయితే ఇది ఆయనకు 107వ సినిమా అవుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp