బాలయ్య మార్కు రౌద్రం - అఫీషియల్

By iDream Post Jun. 09, 2020, 07:25 pm IST
బాలయ్య మార్కు రౌద్రం -  అఫీషియల్

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మిస్తున్న కొత్త సినిమా టీజర్ బర్త్ డే సర్ప్రైజ్ గా ఇందాక విడుదల చేశారు. సింహా, లెజెండ్ తర్వాత వస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఇప్పటికే అభిమానుల్లో దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక బాధ పడుతున్న తమకు ఈ సినిమా రూపంలో బ్లాక్ బస్టర్ ఖాయమనే ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్. టైటిల్ అనౌన్స్ చేస్తారనుకుంటే ఏకంగా వీడియో రూపంలో స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది టీమ్. అఘోరా గెటప్ లో కనిపిస్తాడనే టాక్ తప్ప ఎక్కువ వివరాలు బయటికి రాకుండా గుట్టు సాగించిన బిబి3 టీమ్ మొత్తానికి సూపర్ షాక్ ఇచ్చింది.

పంచెకట్టులో పర్ఫెక్ట్ మ్యాన్లీ లుక్ లో బాలయ్య అదరహో అనేలా ఉన్నారు. బోయపాటి శీను కు మాత్రమే బాలయ్యని ఎలా చూపించాలో తెలుసు అనేలా కట్ చేసిన వీడియో టీజర్ అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులూ మెచ్చుకునేలా ఉంది. ఫ్యాక్షనిజం తరహా గెటప్ లో బాలయ్య ఊర మాస్ గా మరోసారి విశ్వరూపం చూపించేలా ఉన్నారు. ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఇచ్చేశారు. తన చుట్టూ ముట్టిన వాళ్ళను రఫ్ ఆడిస్తూ 'శీను గారు మీ అమ్మ కొడుకు బాగున్నారా మీ అమ్మా మొగుడు బాగున్నాడా అని అడగడానికి చాలా తేడా ఉంది లమ్డీ కొడకా' అంటూ తనదైన శైలిలో అదరగొట్టేశారు.

ఏదైతే బాలకృష్ణ అభిమానులు ఎదురు చూస్తారో దాన్ని సంపూర్ణంగా ఈ టీజర్లో అందించి బోయపాటి శీను నూటికి నూరు శాతం విజయం సాధించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరహో అనేలా కుదిరింది. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం కూడా యాంగిల్స్ ని పర్ఫెక్ట్ గా చూపించింది. మొత్తానికి ఇప్పటిదాకా ఓ మోస్తరు అంచనాలు మాత్రమే ఉన్న బిబి 3 ని ఒక్క వీడియోతో ఎక్కడికో తీసుకెళ్లారు యూనిట్. పర్ఫెక్ట్ గిఫ్ట్ గా ఉన్న ఈ వీడియోలో ఒక్క టైటిల్ లేదనే చిన్న ఫీలింగ్ తప్ప మిగిలినవన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. లాక్ డౌన్ అయ్యాక షూటింగులకు అనుమతులు వచ్చేశాయి కాబట్టి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. మోనార్క్ అనే టైటిల్ ప్రచారం జరిగింది కాని దాన్ని ఇవాళ ధృవీకరించలేదు కాబట్టి ఇంకొన్నాళ్ళు సస్పెన్స్ తప్పదు.

Link Here @ bit.ly/2XLf1L4

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp