బాలయ్య లుక్కు - చిరుకు చిక్కు

By iDream Post Jun. 12, 2020, 12:45 pm IST
బాలయ్య లుక్కు - చిరుకు చిక్కు

రెండు రోజుల క్రితం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్న సినిమా టీజర్ ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. అభిమానుల అంచనాలను పూర్తిగా అందుకుంటూ వాళ్లకు ఏం కావాలో అంతకు మించే చిన్న వీడియో క్లిప్ లో ఫుల్ గా ఇచ్చేశారు. ముఖ్యంగా వైట్ అండ్ వైట్ పంచెకట్టులో బాలయ్య లుక్ సూపర్ గా క్లిక్ అయ్యింది. ఇప్పుడు ఇదే మెగాస్టార్ కు చిక్కు తెచ్చిపెట్టేలా ఉంది. ఎలా అంటారా. కారణం ఉంది. ఆచార్య తర్వాత సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్ లో మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాలయ్య ఫ్రెష్ లుక్ కి అక్కడ మోహన్ లాల్ వేసిన గెటప్ కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి మీసకట్టుతో సహా. అందులోనూ ఇదే తరహా హీరోయిజం ఉంటుంది. కథపరంగా ఎలాంటి పోలికలు ఉండవు కానీ గెటప్ దగ్గరగా ఉంది కాబట్టి చిరంజీవి డ్రెస్ విషయంలో ఎలాంటి మార్పు చేస్తారో వేచి చూడాలి. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ ని యధాతథంగా ఫాలో అవుదాం అనుకుంటే బాలయ్య చిరులు ఒకే తరహా వేషం వేసినట్టు అవుతుంది. గతంలో సమరసింహారెడ్డి టైంలోనూ అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక కొంత గ్యాప్ తో ఇంద్ర వచ్చింది. రెండూ వైట్ అండ్ వైట్ హీరోల గెటప్స్ ఉన్నవే. అయినా ఒకదాన్ని మించి ఒకటి ఘన విజయం సాధించాయి.

అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పు ఉంది. మరి సుజిత్ ఏం చేస్తాడో వేచి చూడాలి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం మన నేటివిటికి తగ్గట్టు హిట్లర్ సినిమా తరహాలో ప్యాంటు చొక్కా ఉండేలా స్కెచ్ వేస్తున్నారని తెలిసింది. త్వరలోనే లుక్ టెస్ట్ కూడా చేయబోతున్నట్టు టాక్. ఇప్పటిదాకా 40 శాతం పూర్తయిన ఆచార్యకు ఇంకో నాలుగు నెలలకు పైగా వర్క్ పెండింగ్ లో ఉంది. 2021 సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే షూటింగ్ జులైలో మొదలైతేనే ఇది సాధ్యమవుతుంది. అంతకన్నా త్వరగా పూర్తయితే నిర్ణయం మారే అవకాశం లేకపోలేదు. దీని సంగతలా ఉంచితే బాలయ్య కొత్త లుక్కు చిరుకు చిక్కు తెచ్చిన మాట వాస్తవం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp