బాలయ్య ఆ రిస్క్ మళ్ళీ చేయరట

By iDream Post Nov. 20, 2020, 01:15 pm IST
బాలయ్య ఆ రిస్క్ మళ్ళీ చేయరట

వంద సినిమాలు పూర్తి చేసుకుని ఈ వయసులోనూ కమర్షియల్ మూవీస్ తో తన సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ఏది చేస్తారనే విషయంలో క్లారిటీ లేదు కానీ నాగశౌర్య నటించే ఓ ప్రాజెక్ట్ లో ఉంటారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. కానీ బాలయ్య సన్నిహితులు మాత్రం అలాంటిది ఏది లేదని చెబుతున్నారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ కు మాట ఇచ్చింది సోలో హీరోగా వేరే సినిమా కోసమని ఇది కాదని అంటున్నారు. ఇది ప్రచారం మాత్రమేనని వాళ్ళ వెర్షన్.

గతంలో చేసిన పొరపాటు రిపీట్ చేయరని సమాచారం. ఆ మధ్య మంచు మనోజ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో బాలయ్య స్పెషల్ క్యామియో ఒకటి చేశారు. రాజసం ఉట్టిపడే ఆ పాత్రకు ఆయన నప్పారు కానీ కంటెంట్ తేడా కొట్టడంతో సినిమా డిజాస్టర్ అయ్యింది. మాములుగా స్పెషల్ రోల్స్, గెస్ట్ అప్పీయరెన్స్ లకు దూరంగా ఉండే బాలకృష్ణ ఎందుకో ముచ్చటపడి మరీ ఆ సినిమా చేస్తే అలా తుస్సుమనిపించింది. అందుకే ఇక ఏ యూత్ హీరో సినిమాలోనూ ఇలాంటి పాత్రలకు ఒప్పుకోకూడదని డిసైడ్ అయ్యారని తెలిసింది. అందుకే నాగశౌర్య స్టోరీని వద్దన్నట్టు సమాచారం.

ఇక బోయపాటి శీనుతో చేస్తున్న మూవీని వచ్చే ఏడాది వేసవికి టార్గెట్ చేశారు. చిన్న చిన్న బ్రేకులతో షూటింగ్ కొనసాగుతోంది. అధికారికంగా సాయేషా సైగల్ ని మాత్రమే హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారు. పూర్ణతో పాటు మరొకరు కూడా ఉండబోతున్నారు. అఘోరా, ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య చేసే డ్యూయల్ రోల్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. దీని సంగతలా ఉంచితే తనకు మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బి గోపాల్ తో బాలకృష్ణ మరో సినిమా చేస్తారనే టాక్ చాలా రోజుల నుంచే ఉన్నప్పటికీ ఆదిత్య 369 సీక్వెల్ కూడా ప్లానింగ్ లో ఉందట. వీటిని చేస్తారో లేక ఇంకో ఆలోచన ఏదైనా ఉందేమో చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp