నిప్పురవ్వని మర్చిపోతే ఎలా

By iDream Post Jul. 20, 2021, 02:34 pm IST
నిప్పురవ్వని మర్చిపోతే ఎలా

ఇవాళ మరోసారి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి అవకాశం ఇచ్చారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ గా మారి ట్విట్టర్ ఫేస్ బుక్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ఆయన మాట్లాడుతూ ఏఆర్ రెహమాన్ పదేళ్లకో హిట్ ఇస్తాడని ఆయనకు వచ్చిన ఆస్కార్ గురించి కూడా కాస్త తేలికైన పదజాలంతో తీసేయడం ఫ్యాన్స్ ని నిజంగా షాక్ కి గురి చేసింది. ఇక్కడే బాలయ్య ఒక ముఖ్యమైన పాయింట్ మిస్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ తెరంగేట్రం చేసిందే తెలుగు సినిమాతో. అది బాలకృష్ణ హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన నిప్పురవ్వ. దానికి బప్పీలహరి పాటలు మాత్రమే ఇచ్చారు.

కీలకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది రెహమానే. అప్పటికింకా ఆయనకు అంత పేరు లేదు. దానికి తోడు బంగారు బుల్లోడుతో ఒకే రోజు పోటీ పడిన నిప్పురవ్వ ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈ విషయం సామాన్య ప్రేక్షకుల దృష్టిలో పెద్దగా పడలేదు. నిజంగా నిప్పురవ్వకు రెహమాన్ మంచి బీజీఎమ్ ఇచ్చారు. సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ కు ఎలివేషన్ స్కోర్ బాగా కుదిరింది. బహుశా బాలయ్య ఇదంతా మర్చిపోయి ఉండొచ్చు ఆ తర్వాత బాలయ్య సినిమాకు రెహమాన్ పనిచేయలేదు కానీ డబ్బింగ్ సినిమాల ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇవ్వడం ఎవరూ మర్చిపోలేరు.

ఇప్పుడు ఫామ్ తగ్గినప్పటికీ రెహమాన్ ప్రస్థానం మాత్రం నిజంగానే గొప్పది. అలాంటి వ్యక్తి మీద కామెంట్స్ అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. బాలకృష్ణ ఏ ఉద్దేశంలో అన్నా ఇప్పుడీ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. నిప్పురవ్వ తాలూకు వీడియోలను షేర్ చేసి మరీ కొందరు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు అవతార్ ని ఏళ్ళకేళ్లు తీస్తున్న జేమ్స్ క్యామరూన్ మీద కూడా విసుర్లు వేశారు నందమూరి హీరో. ఈ ముఖాముఖిలోనే గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ తర్వాత అనిల్ రావిపూడితో చేయబోయే సినిమాకు సంబంధించి కూడా బాలయ్య క్లారిటీ ఇచ్చేశారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp