హిట్ వేడుకలో స్వీటీ మెరుపులు

By Ravindra Siraj Feb. 24, 2020, 10:16 am IST
హిట్ వేడుకలో స్వీటీ మెరుపులు

నిన్న జరిగిన విశ్వక్ సేన్ హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సమర్పకుడుగా వ్యవహరించిన నాని వల్ల రాజమౌళి, అనుష్క, అల్లరి నరేష్, సందీప్ కిషన్, రానా లాంటి స్పెషల్ గెస్టులు రావడంతో వేడుక నిండుగా జరిగింది. గత కొంతకాలంగా మీడియా కంటికి దూరంగా ఉన్న అనుష్క చాన్నాళ్ల తర్వాత కెమెరా ముందు రావడంతో ముఖ్యంగా అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్టేజి మీద విల్లు ఎక్కుపెట్టి బాణం వదలడం లాంటివి చేయడంతో మంచి జోష్ వచ్చింది.

పరిశ్రమకు వచ్చిన 15 ఏళ్ళలో అనుష్క ఎప్పుడూ ఇంత గ్యాప్ తీసుకోలేదు. 2018లో వచ్చిన భాగమతి తన ఫుల్ లెన్త్ రోల్ మూవీ. ఆ మధ్య సైరాలో చేసింది కానీ అది కేవలం ఒక సీన్ కు మాత్రమే పరిమితమైన క్యామియో కాబట్టి ఫ్యాన్స్ అంతగా సంతృప్తి చెందలేదు. బాహుబలి తర్వాత అనూహ్యంగా తన స్పీడ్ తగ్గించిన అనుష్క గురించి తన ఆరోగ్యం గురించి ఆ మధ్య ఏవేవో వార్తలు ప్రచారమయ్యాయి కానీ ఇప్పుడు తనను మళ్ళీ మునుపటి రూపంలో చూసాక ఒకరకంగా అందరికి రిలీఫ్ అనే చెప్పొచ్చు.

అనుష్క కొత్త సినిమా నిశ్శబ్దం పలు వాయిదాల మధ్య ఏప్రిల్ కు ప్లాన్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ హారర్ మూవీ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. దీంతో తను గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి నటిస్తున్న కొరటాల శివ సినిమాలో త్రిషతో పాటు తనను కూడా హీరోయిన్ గా తీసుకోవచ్చన్న ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్స్ బయటికి రావడం లేదు. గతంలో స్టాలిన్ లో చిరుతో కలిసి స్పెషల్ సాంగ్ చేసిన స్వీటీ ఆ తర్వాత మెగా కాంబినేషన్ ని రిపీట్ చేయలేకపోయింది. అసలు నిశ్శబ్దం తర్వాత ఏ సినిమాలు చేస్తుందన్న క్లారిటీ కూడా తను ఇవ్వడం లేదు. మరోవైపు అనుష్క పెళ్లి గురించిన వార్తలు కూడా షికారు చేశాయి. వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే నిశ్శబ్దం తాలూకు ప్రమోషన్లకు వచ్చినప్పుడు అడగటం తప్ప వేరే ఆప్షన్ లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp