సెన్సిబుల్ దర్శకుడితో మరో లవ్ స్టొరీ

By iDream Post May. 23, 2020, 02:50 pm IST
సెన్సిబుల్ దర్శకుడితో మరో లవ్ స్టొరీ

సున్నితమైన భావోద్వేగాలతో చిత్రాలు తీసే దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్యతో లవ్ స్టొరీ చేస్తున్న సంగతి తెలిసిందే . లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి విడుదల తేదికి దగ్గరగా ఉండేది. సాయి పల్లవి హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఫిదా తర్వాత రెండేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కావడంతో బిజినెస్ పరంగానూ చాలా క్రేజ్ ఉంది. దీన్ని ఆసియన్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా దీని తర్వాత ప్రాజెక్ట్ కూడా శేఖర్ కమ్ములతోనే చేయబోతున్నట్టు సమాచారం. ఆ మేరకు ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.

పరిస్థితి సద్దుమణిగాక అధికారిక ప్రకటన విడుదల చేస్తారు. ఇంకా లవ్ స్టొరీ రిలీజ్ కాకుండానే శేఖర్ కమ్ములకు అదే నిర్మాత ఆఫర్ ఇవ్వడం విశేషం. వాస్తవానికి ఈ దర్శకుడు సినిమాకు మధ్య గ్యాప్ కాస్త ఎక్కువగా తీసుకుంటారు. మరి లవ్ స్టొరీ రిలీజ్ కాగానే ఇది మొదలుపెడతారా లేక ఇంకొంత కాలం స్క్రిప్ట్ కోసం ఆగుతారా అనేది వేచి చూడాలి.ఇప్పుడీ ఖాళీ సమయాన్ని దాని కోసమే కేటాయించినట్టు వినికిడి. ఆనంద్, హ్యాపీ డేస్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి ఫీల్ గుడ్ సబ్జెక్ట్స్ ని డీల్ చేసిన శేఖర్ కమ్ముల ఇప్పటిదాకా చేసినవాటిలో అనామిక ఒకటే రీమేక్. హింది బ్లాక్ బస్టర్ కహానికి రీమేక్ గా రూపొందిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాపయ్యింది.

ఇక అప్పటి నుంచి తన జానర్ నుంచి బయటికి వచ్చి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్న శేఖర్ కమ్ముల ఫిదా, లవ్ స్టొరీలను కూడా తన శైలిలోనే తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆసియన్ సంస్థలోనే డైరెక్ట్ చేయబోతున్న రెండో సినిమాలోనూ స్టార్ హీరోనే సెట్ చేయబోతున్నట్టు మరో వార్త. అతను ఎవరు లాంటి వివరాలు మాత్రం ఇప్పటికైతే తెలియదు. షూటింగులు తిరిగి ప్రారంభమయ్యాక ఒక్కొక్కటిగా తెలిసే అవకాశం ఉంది. క్యాస్టింగ్ లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే శేఖర్ కమ్ముల హీరొయిన్ గా పర్ఫర్మార్స్ ని మాత్రమే తీసుకుంటారు. గ్లామర్ కు ప్రాధాన్యం ఉండదు. మరి మూడోసారి సాయి పల్లవిని రిపీట్ చేస్తారా లేక వేరే ఆప్షన్ చూసుకున్నారా ప్రస్తుతానికి సస్పెన్స్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp