దీపికాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉందోచ్

By Satya Cine Jul. 31, 2020, 10:53 pm IST
దీపికాతో పాటు మరో హీరోయిన్ కూడా ఉందోచ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈమధ్య దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుందని అధికారికంగా ప్రకటించారు ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అయిన దీపికా ను ఎంపిక చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో దీపికతో పాటు మరొక హీరోయిన్ ను కూడా ఎంపిక చేయాల్సి ఉందట. దీపిక పాత్ర ప్రభాస్ తో సమానంగా ఉంటుందని, అయితే కథ ప్రకారం ఈ సినిమాలో మరొక హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్ర కథలో కీలక మలుపుకు కారణమవడంతో పాటుగా ప్రభాస్ తో ఒక డ్యూయెట్ కూడా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సెకండ్ లీడ్ పాత్రకు దక్షిణాది హీరోయిన్ ను ఎంపిక చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి 2022 లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లానింగ్ లో ఉన్నారట. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని నాగ్ అశ్విన్ ఇప్పటికే అభిమానులకు హామీ ఇచ్చారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందనే ఊహాగానాలు ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp