టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న విశ్వాసం కూతురు

By iDream Post Nov. 25, 2020, 05:36 pm IST
టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న విశ్వాసం కూతురు

మల్లు వుడ్ సూపర్ హిట్ మూవీ కప్పేలా రీమేక్ కు ఉప్పెన భామ కృతి శెట్టిని తీసుకున్నట్టుగా గత వారం గట్టి ప్రచారమే జరిగింది. అయితే తను రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల ఇప్పుడీ ప్రాజెక్ట్ కొత్తమ్మాయికి వెళ్లిందని ఫిలిం నగర్ టాక్. తనే అనిఖా సురేంద్రన్. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా 2007లో చొట్టా ముంబైతో కెరీర్ ప్రారంభించి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న ఈ పాప టీనేజ్ కు వచ్చాక స్టార్ల చిత్రాల్లో కూతురిగా చాలా పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా అజిత్ ఎంతవాడుగాని, విశ్వాసం దెబ్బకు అనిఖా రేంజ్ మారిపోయింది. ఆఫర్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. అయితే తను కెరీర్ ప్లానింగ్లో చాలా జాగ్రత్త వహిస్తోంది.

ఇటీవలే క్వీన్ వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రశంసలు అందుకుంది. అందుకే కప్పేలా రీమేక్ కోసం సితారా సంస్థ తనను ఎంచుకున్నట్టు తెలిసింది. డెబ్యూ కోణంలో చూసుకుంటే ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఒరిజినల్ వెర్షన్ లో కథ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. ఊహించని పాయింట్ తో రూపొందిన ఈ మూవీ అందరినీ మెప్పించింది. అందుకే తెలుగులోనూ తగిన జాగ్రత్తలతో స్క్రిప్ట్ ని రూపొందించారట. అయితే దర్శకుడు ఎవరు మిగిలిన టీమ్ వివరాలు ఏవీ ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి అనీఖా సురేంద్రన్ ఓకే చెప్పినట్టు మాత్రమే అప్ డేట్ తెలుస్తోంది.

ఇందులో కీలకమైన రెండు పాత్రలకు నవీన్ చంద్ర ఇప్పటికకే ఓకే కాగా విశ్వక్ సేన్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందట. ఫైనల్ కాగానే అధికారిక ప్రకటన చేస్తారు. సితార సంస్థ మరో రీమేక్ అయ్యప్పనుం కోశియుమ్ పనుల్లో బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కాబట్టి బడ్జెట్ లో రాజీ పడకుండానే తక్కువ టైంలో పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు సంబంధించి క్యాస్టింగ్ పూర్తి కాగానే అన్ని వివరాలు మీడియాకు వెల్లడిస్తారు. మొత్తానికి కప్పేలా లాంటి డిఫరెంట్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న అనీఖాకు హిట్టు దక్కితే టాలీవుడ్ కు మరో హీరోయిన్ వచ్చేసినట్టే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp