ఎప్పుడూ చేయని పాత్రలో బన్నీ ?

By iDream Post Jun. 22, 2021, 03:55 pm IST
ఎప్పుడూ చేయని పాత్రలో బన్నీ ?

ప్రస్తుతం పుష్ప షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ దీని తర్వాత వెంటనే పుష్ప 2 చేయడం లేదన్న క్లారిటీ వచ్చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో ఐకాన్ ఫినిష్ చేసి ఆపై మళ్ళీ పుష్ప సీక్వెల్ ని కొనసాగించబోతున్నారు. ఈ మేరకు గీత ఆర్ట్స్ 2 నిర్మాత బన్నీ వాస్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పడం సోషల్ మీడియాలో హై లైట్ అయ్యింది. ఇదిలా ఉండగా ఐకాన్ లో ముందు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం అయితే హీరో పాత్రకు కళ్ళు ఉండవట. అందుకే క్యాప్షన్ కూడా కనపడుట లేదు అని పెట్టారని అప్పట్లోనే టాక్ వచ్చింది. మరి బన్నీ ఇప్పుడు నిజంగా అంత రిస్క్ చేస్తాడా లేక నిజంగా కంటెంట్ లో అంత బలముందా అనేది తెలియాల్సి ఉంది.

ఇలా హీరోలు కళ్ళు లేకుండా నటించడం చాలా అరుదు. కమల్ హాసన్ అమావాస్య చంద్రుడు, రవితేజ రాజా ది గ్రేట్, నితిన్ మాస్ట్రో ఇలా చాలా తక్కువగా లీడ్ రోల్ అంధులుగా నటించినవి ఉన్నాయి. అయితే ఐకాన్ లో చివరిదాకా హీరోకు ఈ వైకల్యం ఉండదని, చాలా కీలకమైన ట్విస్ట్ తర్వాత కథ ఇంకో మలుపు తిరుగుతుందని ఇన్ సైడ్ టాక్. గత కొద్దిరోజులుగా నిర్మాత దిల్ రాజు కానీ దర్శకుడు వేణు శ్రీరామ్ కానీ ఎక్కడా కనిపించడం ఈ ప్రస్తావన తేవడం చేయడం లేదు. సో మరోసారి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఐకాన్ కి సంబంధించిన క్లారిటీ వచ్చేలా లేదు. దాని కోసం ఫ్యాన్స్ వేచి చూడక తప్పదు.

పుష్పను ఆగస్ట్ చివరిలోగా మొత్తం పూర్తి చేసేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు. దసరాకు సాధ్యం కాకపోతే దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కానీ ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో థర్డ్ వేవ్ పూర్తిగా రాకపోవడం మీద ఆధారపడి ఉంటుంది. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ కథల ఎంపికలో చాలా ప్లానింగ్ తో ఉంటున్నాడు. ఐకాన్ ఒకవేళ ఓకే అయితే చాలా మార్పులు అవసరం పడొచ్చు. వకీల్ సాబ్ తో గట్టిగానే ప్రూవ్ చేసుకున్న వేణు శ్రీరామ్ ఐకాన్ ని చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారట. మరి ఇదంతా ఎంతవరకు నిజమో తెలియాలంటే ఓ రెండు మూడు నెలలు వెయిట్ చేయాలి మరి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp