మళ్ళీ తెరపైకొచ్చిన అల్లు ఐకాన్

By iDream Post Jun. 11, 2021, 03:30 pm IST
మళ్ళీ తెరపైకొచ్చిన అల్లు ఐకాన్
అల వైకుంఠపురములోతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాక కరోనా వల్ల ఇప్పటికే ఏడాదిన్నర గ్యాప్ వచ్చేసిన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప రెండు భాగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ కి సంబంధించి ఓ పాతిక శాతం మాత్రమే పెండింగ్ ఉందని ఇన్ సైడ్ టాక్. లాక్ డౌన్ అవ్వగానే వీలైనంత వేగంగా దీన్ని పూర్తి చేయబోతున్నారు. దాని తర్వాత వెంటనే పుష్ప 2 కూడా చేసేస్తారనే వార్త ఇప్పటికే ప్రచారంలో ఉంది. అయితే అల్లు అర్జున్ బృందంలో అత్యంత కీలక సభ్యుడైన నిర్మాత బన్నీ వాస్ ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆసక్తికరంగానే కాక కొంత అయోమయానికి కూడా గురి చేస్తున్నాయి.

ఆయన వెర్షన్ ప్రకారం పుష్ప 1 అవ్వగానే ఐకాన్ సెట్స్ పైకి వెళ్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు దీన్ని నిర్మించేలా గతంలోనే అధికారిక ప్రకటన వచ్చింది. ఇదయ్యాక మళ్ళీ పుష్ప 2ని తీసుకొస్తారు. దీనికి సంబంధించిన స్టోరీ వర్క్ ఇంకా జరుగుతోందట. అంటే సీక్వెల్ కి ఫైనల్ వెర్షన్ సిద్ధం కాలేదన్న మాట. ఒకవేళ ఇదే నిజమనుకుంటే పుష్ప 2 కోసం బన్నీ మళ్ళీ హెయిర్ స్టైల్ పెంచుతాడా అనేదే అసలు అనుమానం. ఎందుకంటే ఇది రెగ్యులర్ సినిమాలకు సూటయ్యే గెటప్ కాదు. అంత సులభంగా వచ్చేదీ కాదు. అలాంటప్పుడు పుష్ప 2కి బ్రేక్ ఇవ్వకుండా బాహుబలి లాగా ఒకేసారి చేస్తే సరిపోద్దిగా.

ఇదెవరో వేరే వాళ్ళు చెప్పి ఉంటే అనుమానంగా చూడొచ్చు కానీ అల్లు కాంపౌండ్ లో కీలకంగా వ్యవహరించే బన్నీ వాస్ నోటి నుంచే వచ్చింది కాబట్టి పుష్ప 2 అఫీషియల్ గా లేట్ అని చెప్పినట్టే. ఇంతకీ పుష్ప 1 విడుదల విషయం కూడా ఇంకా తేలలేదట. సెప్టెంబర్ లేదా అక్టోబర్ దాక పూర్తి సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు కాబట్టి చిన్న మరియు మీడియం బడ్జెట్ చిత్రాలు వేరే ఆప్షన్లు చూసుకోవచ్చని చెప్పారు. దీన్ని బట్టి రాబోయే రోజుల్లో డిజిటల్ రిలీజులు మళ్ళీ వేగమందుకునే అవకాశం ఎక్కువగా ఉంది.   ఏది ఏమైనా ఈ అనిశ్చితిలో ఎవరు ఏదీ చెప్పినా అది జరుగుతుందన్న నమ్మకం అయితే లేదు
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp