స్టైలిష్ స్టార్ మనసులో ఏముంది

By iDream Post May. 03, 2021, 04:30 pm IST
స్టైలిష్ స్టార్ మనసులో ఏముంది
కొవిడ్ పాజిటివ్ టెస్ట్ అయ్యాక ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విలన్ ఫహద్ ఫాసిల్ ఇక్కడ కేసుల తీవ్రత దృష్ట్యా కేరళకు వెళ్లిపోవడంతో పాటు చాప కింద నీరులా కేసులు పెరుగుతూ పోవడంతో దర్శకుడు సుకుమార్ కూడా ప్యాకప్ చెప్పక తప్పలేదు. పరిస్థితులు చూస్తుంటే ఆగస్ట్ విడుదల అనుమానంగానే ఉంది. ఒకవేళ అటుఇటు అయినా దసరా లేదా డిసెంబర్ లో ప్లాన్ చేసుకునేలా టీమ్ పునరాలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే కీలక భాగం పూర్తి చేసుకున్న పుష్ప ఇంకొన్ని ముఖ్యమైన ఎపిసోడ్స్ ని తీయాల్సి ఉంది. వాతావరణం నార్మల్ అయ్యేదాకా వేచి చూడక తప్పేలా లేదు.

ఇదిలా ఉండగా దీని తర్వాత బన్నీ మురుగదాస్ తో చేయొచ్చనే వార్త జోరుగా ప్రచారమవుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ దీన్ని నిర్మిస్తారని అందులో పేర్కొంటున్నారు. అయితే నా పేరు సూర్య తర్వాత స్టోరీ ప్లస్ డైరెక్టర్ సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న అల్లు అర్జున్ దాస్ కి అంత ఈజీగా ఓకే చెప్పారా అంటే అనుమానమే. ఎందుకంటే దాస్ మునుపటి ఫామ్ లో లేరు. రజనీకాంత్ దర్బార్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతకు ముందు సర్కార్ కూడా విజయ్ ఇమేజ్ వల్ల కమర్షియల్ గా సేఫ్ అయ్యింది కానీ అది తన స్థాయి సినిమా కాదు. సెవెంత్ సెన్స్ నుంచి ఇదే కొనసాగుతోంది.

అలాంటప్పుడు బన్నీ దాస్ కాంబో ఎలా సాధ్యమనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. కొరటాల శివతో చేయాల్సిన సినిమా వాయిదాలోకి వెళ్లిపోయింది. భవిషత్తులో అయినా ఉంటుందా లేదా గ్యారెంటీ లేదు. మరోవైపు అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ లాంటి మోస్ట్ వాంటెడ్ దర్శకులను కోరుకుంటున్నాడు. ఒకవేళ మురుగదాస్ చెప్పిన కథ ఏమైనా అద్భుతంగా అనిపించి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేడేమో వేచి చూడాలి. అల వైకుంఠపురములో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సాధించాక ఏమరుపాటుగా ఉండేందుకు బన్నీ ఇష్టపడటం లేదు. మరి దాస్ ప్రాజెక్ట్ ని ఎంతవరకు ఒప్పుకుని ఉంటాడో తేలాలంటే కొంత సమయం  వేచి చూడాలి
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp