ఆల్ ఈజ్ వెల్ అంటున్న నయన్ లవర్

By Ravindra Siraj Jan. 09, 2020, 11:37 am IST
ఆల్ ఈజ్ వెల్ అంటున్న నయన్ లవర్

సినిమాలకు సంబంధించిన విశేషాల పట్ల జనం ఎంత ఆసక్తి చూపిస్తారో హీరో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల మీద అంతకన్నా ఎక్కువే తెలుసుకోవాలని తాపత్రయ పడుతుంటారు. అందులోనూ ఫామ్ లో ఉన్న బ్యూటీల గురించి ఇది రెట్టింపు స్థాయిలో ఉంటుంది. విషయానికి వస్తే ఇటీవలే నయనతారకు తన బాయ్ ఫ్రెండ్ దర్శకుడు విగ్నేష్ శివన్ తో అభిప్రాయం భేదాలు వచ్చాయని బ్రేకప్ దిశగా వెళ్తున్నారని కాస్త గట్టి ప్రచారమే సాగింది.

వీటికి చెక్ పెట్టడం కోసమే అన్నట్టుగా విగ్నేష్ శివన్ సోషల్ మీడియాలో తన లవర్ తో ఉన్న లేటెస్ట్ పిక్ ఒకటి పోస్ట్ చేశాడు. దీంతో పుకార్లకు బ్రేక్ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత నాలుగేళ్లకు పైగా ఈ ఇద్దరూ డీప్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. పైకి ఎక్కడా తాము ప్రేమలో ఉన్నట్టు కానీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కానీ చెప్పలేదు. అయితే క్రమం తప్పకుండ నయనతారకు సంబంధించిన ఏ ఈవెంట్ జరిగినా లేదా విగ్నేష్ సినిమా వేడుక ఏదైనా ఇద్దరూ కలిసే జోడిగా వెళ్లడం అందరికి సర్వసాధారణం అయిపోయింది.

కానీ నయనతార కెరీర్ ఇంకా ఫుల్ స్వింగ్ లో ఉన్న కారణంగా పెళ్లిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పటికీ నయన్ కాల్ షీట్ల కోసం డిమాండ్ మాములుగా లేదు. ఆ మధ్య శింబుతో ఓసారి ప్రభుదేవాతో ఓ సారి ప్రేమాయణం సాగించిందని నయన్ మీద వచ్చిన మీడియా కథనాలు కోకొల్లలు. తర్వాత ఎక్కువ కాలం నిలిచిన వార్త విగ్నేష్ శివన్ తో సాగిన బంధమే. ఇటీవలే జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ కు నయన్ ఒంటరిగాగా వెళ్లడమే ఈ గాసిప్స్ కు తెరలేపింది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుని ఒక్కటి కావడమే ఈ ఇద్దరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం. నయనతార నటించిన దర్బార్ ఈ రోజు విడుదల కాగా ఈ ఏడాదే మరో నాలుగు సినిమాల దాకా వచ్చే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp