పవర్ స్టార్ స్టామినాకు పరీక్ష

By iDream Post Apr. 08, 2021, 02:00 pm IST
పవర్ స్టార్ స్టామినాకు పరీక్ష
రేపీపాటికి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద ఏ స్థాయిలో జన జాతర ఉంటుందో ఊహించుకోవడం కష్టంగా ఉంది. సుమారు ఏడాది తర్వాత వంద కోట్లకు పైగా మార్కెట్ ఉన్న అతి పెద్ద హీరో సినిమా విడుదల కాబోతుండటంతో వకీల్ సాబ్ మేనియా మాములుగా లేదు. ఒక రీమేక్ కు అందులోనూ హిందీ తమిళ వెర్షన్లు ఓటిటిలో సులభంగా అందుబాటులో ఉన్న మూవీ రీమేక్ కు ఇంత క్రేజ్ అంటే అదంతా మూడేళ్ళ తర్వాత వస్తున్న పవన్ మేనియా తాలూకు ఫలితమే. చాలా చోట్ల ఇంకా అనుమతులు రాకపోయినా వస్తాయనే నమ్మకంతో తెల్లవారుఝామున బెనిఫిట్ షోల టికెట్లు కూడా అమ్మేశారు. ఆన్ లైన్ ఫ్యాన్స్ అప్పుడే వాటిని ఫోటోలు పెడుతున్నారు.

దాదాపు 90 శాతం స్క్రీన్లను వకీల్ సాబ్ ఆక్రమించుకోబోతున్నాడు. గత వారం వచ్చిన వాటిలో వైల్డ్ డాగ్ వారం దాటకుండానే డెఫిషిట్ లోకి వెళ్లిపోగా హంగామా చేసిన సుల్తాన్ సైతం సోసోగానే రన్ అవుతున్నాడు. ఇక జాతిరత్నాలు, రంగ్ దే పని ఆల్రెడీ అయిపోయింది. గాడ్జిలా వెర్సస్ కాంగ్ మాత్రం కొన్ని మాల్టీ ప్లెక్సుల్లో రన్ అవుతోంది. బీసీ సెంటర్లలో ఇంకెవరు కనిపించరు. వన్ అండ్ ఓన్లీ వకీల్ సాబ్ అంతే. టికెట్ రేట్లు ఎంత ఉన్నా అభిమానులు లెక్క చేయడం లేదు. అధిక శాతం థియేటర్లలో వంద నుంచి నూటాయాభై దాకా అధికారికంగా పెంచి అమ్ముతున్నా కూడా టికెట్లు మిగలడం లేదు. హాట్ కేక్ అనే పదం కూడా చిన్నదే.

ఈ లెక్కన రేపు భారీ ఎత్తున ఫిగర్స్ నమోదు కాబోతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఎంతలేదన్నా ముప్పై నుంచి నలభై కోట్ల మధ్యలో షేర్ వచ్చినా ఆశ్చర్యం లేదని ఇవన్నీ విశ్లేషిస్తున్న పరిశీలకుల మాట. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం చాలా ముఖ్యం. మొత్తం పవన్ వన్ మ్యాన్ షో ఉంటేనే సరిపోదు. ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించే కంటెంట్ బలంగా ఉందనే మాట బయటికి వెళ్ళాలి. వీకెండ్ తర్వాత రావాల్సింది వీళ్ళే. దిల్ రాజు మాత్రం ఎంతైనా ఊహించుకోండి అంతకు మించి ఇస్తామని ఇంటర్వ్యూలో నొక్కి చెబుతున్నారు. చూద్దాం రేపు ఈ సమయానికల్లా రిపోర్టులు రివ్యూలు టాకులు అంటూ అంతా తెలిసిపోతుందిగా
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp