అల వైకుంఠపురములో ఇప్పుడే కాదంట...

By Rishi K Feb. 25, 2020, 07:24 pm IST
అల వైకుంఠపురములో ఇప్పుడే కాదంట...

సంక్రాంతి బరిలో విజేతగా నిలిచి నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలుకొట్టే దిశగా దూసుకెళుతున్న అల్లు అర్జున్-త్రివిక్రమ్ బంఫర్ హిట్ సినిమా అల వైకుంఠపురములో ఇప్పటికి మంచి కలెక్షన్స్ రాబడుతుంది.

ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు కూడా విడుదలైన ఆరు వారాలకే OTT లో వస్తుండటంతో చాలా మంది
ప్రేక్షకులు కొద్దీ రోజులు ఆగి amozon prime /netflix/hotstar/sun nxt లో చూద్దాంలే అనుకోవటంతో సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది. తమ సినిమా మీద ఈ ప్రభావం పడకుండా చూడటం కోసం అల వైకుంఠపురములో రిలీజ్ కు ముందే "You won't see this on amazon prime or NETFLIX " అని, అందరు థియేటర్లకు వెళ్లే సినిమా చూడాలని ఆ చిత్ర బృందం ప్రచారం చేసింది.

అయితే వారం కిందట అల వైకుంఠపురములో SUN NXT లో ఈ నెల 26న ప్రీమియర్ అవుతుందని SUN NXT ఒక ప్రకటన ఇచ్చింది.సినిమా పెద్ద హిట్ కావటంతో ఈ సినిమా మీద ప్రేక్షకులుకు ఇప్పటికి ఆసక్తి ఉంది .. SUN NXT లో అల వైకుంఠపురం చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సాయంత్రం SUN NXT వాళ్ళు "Premiering on 26th Feb" అన్న ఫోస్టర్ లను తొలగించి "Coming Soon" అన్న పోస్టర్లు పెట్టారు. SUN NXT వాళ్ళ ట్విట్టర్ కవర్ పేజీ ని కూడా మార్చేశారు... దీనితో రేపు అల వైకుంఠపురములో SUN NXT లో ప్రీమియర్ కావటం లేదని స్పష్టమయ్యింది.

ముందు ప్రకటించినట్లు రేపు ఎందుకు ప్రీమియర్ కావటంలేదో SUN NXT ప్రకటించలేదు కానీ సినిమా ఇప్పటికీ మంచి కలెక్షన్స్ రాబడుతుండటంతోనే రేపు ప్రీమియర్ కావటం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతుండగా ,మరికొందరు ఇదంతా SUN NXT పుబ్లిసిటీలో భాగంగానే జరిగిందని భావిస్తున్నారు...

ఏది ఏమైనా అల వైకుంఠపురములో సినిమాను థియేటర్ కు వెళ్లి చూడని ప్రేక్షకులు SUN NXT లో చూడటానికి మరికొంత కాలం ఆగవలసిందే ...!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp