అల‌వైకుంఠ‌పురం క‌థ‌ - ANR క‌న్న‌కొడుకు ఒక‌టే

By Rahul.G Dec. 02, 2019, 04:13 pm IST
అల‌వైకుంఠ‌పురం క‌థ‌ - ANR క‌న్న‌కొడుకు ఒక‌టే

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ న‌టిస్తున్న అల‌వైకుంఠ‌పురం క‌థ‌పై చాలా ఊహాగానాలు ఉన్నాయి. " అఆ" సినిమా య‌ద్ద‌న‌పూడి "మీనా"కి జిరాక్స్‌గా తీసిన‌ప్ప‌టి నుంచి త్రివిక్ర‌మ్ క‌థ‌పై ప్రేక్ష‌కుల‌కి న‌మ్మ‌కం పోయింది. అందుకే టీజ‌ర్ చూసిన‌ప్ప‌టి నుంచి ఎవ‌రికి తోచిన‌ట్టు వాళ్లు ఊహిస్తున్నారు.

తొలుత ఎన్టీఆర్ పాత సినిమా ఇంటిగుట్టుకి కాపీ అన్నారు. అయితే ఇంటిగుట్టులో బిడ్డ‌లు మారిపోతారు. హీరో అనాథ‌శ‌ర‌ణాల యంలో పెరిగి ఇన్‌స్పెక్ట‌ర్ అవుతాడు. అల‌వైకుంఠ‌పురంలో హీరో ప‌నివాడే త‌ప్ప ఇన్‌స్పెక్ట‌ర్ కాదు.

ఎన్టీఆర్ దేవుడుచేసిన మ‌నుషులు కూడా ఇదే జాన‌ర్‌. చిన్న‌ప్పుడే ఇంటికి దూర‌మైన హీరో పెద్ద‌య్యాకా త‌న ఇంటికే వ‌స్తాడు. తండ్రిని గుర్తుప‌డుతాడు. కానీ తండ్రి గుర్తు ప‌ట్ట‌డు. మేనేజ‌ర్‌గా ఆ ఇంటిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తాడు. దీంట్లో కూడా హీరో ప‌నివాడు కాడు.

అయితే 1973లో వ‌చ్చిన క‌న్న‌కొడుకు క‌థ అల‌వైకుంఠ‌పురానికి మ్యాచ్ అవుతుంది. దీంట్లో ANR హీరో. క‌థ ఏమిటంటే

గుమ్మ‌డికి జ్యోతిష్యం పిచ్చి. కొడుకు పుట్టిన వెంట‌నే గుమ్మ‌డి త‌ల్లి చ‌నిపోతుంది. ఒక జ్యోతిష్కుడి స‌ల‌హా అడిగితే బిడ్డ వ‌ల్ల న‌ష్టాలు జ‌రుగుతాయ‌ని అంటాడు. దాంతో గుమ్మ‌డి బిడ్డ‌ని తీసుకుని ఒక వంతెన కింద వ‌దిలేసి వ‌స్తాడు. కానీ డ్రైవ‌ర్ ఆ బిడ్డని కాపాడి త‌న చెల్లెలికి ఇచ్చి పెంచ‌మంటాడు.

ఆ త‌ర్వాత గుమ్మ‌డికి ఇంకో కొడుకు పుడుతాడు. హీరోకి ప‌దేళ్ల వ‌య‌స్సులో క‌న్న‌తండ్రి ఇంట్లోనే ప‌నివాడుగా చేరుతాడు. తండ్రి , త‌మ్ముడు, త‌ల్లికి సేవ‌లు చేస్తూ ఉంటాడు. ఒక‌రోజు త‌ల్లికి నిజం తెలుస్తుంది. కానీ త‌న కొడుక్కి ఏం ప్ర‌మాద‌మోన‌ని ఎవ‌రికీ చెప్ప‌దు.

ఆ ఇంట్లోనే ప‌నివాడుగా ఉన్న హీరో ANR, త‌న త‌మ్ముడు కృష్ణంరాజుని (త్రివిక్ర‌మ్ సినిమాలో సుశాంత్‌) దారికి తీసుకొచ్చి ఇంటిని మారుస్తాడు. మ‌ధ్య‌లో ల‌వ్‌ట్రాక్‌, రాజ‌బాబు కామెడీ. ఈ సినిమా అప్పుడు యావ‌రేజ్‌గా ఆడింది.

అల‌వైకుంఠ‌పురంలో గుమ్మ‌డి క్యారెక్ట‌ర్ ముర‌ళిశ‌ర్మ వేశాడు. క‌థ‌ని త్రివిక్ర‌మ్ స్టైల్‌లో ప్రాస‌లు, పంచ్‌ల‌తో మ‌ల‌చి ఉంటారు. తండ్రి ఇంట్లోనే ప‌నివాడుగా ఎమోష‌న్‌ని బ‌న్ని ర‌క్తి క‌ట్టించి ఉంటాడు.

కొత్త క‌థ‌లు లేవు. పాత‌క‌థ‌ల‌కే బూజు దులిపి రంగులేసి చూపించ‌డ‌మే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp