అక్షయ్ బాంబుకి డేట్ ఫిక్స్ : అఫీషియల్

By iDream Post Sep. 16, 2020, 03:45 pm IST
అక్షయ్ బాంబుకి డేట్ ఫిక్స్ : అఫీషియల్

బాలీవుడ్ లోనే మోస్ట్ వెయిటెడ్ ఓటిటి రిలీజ్ గా భారీ అంచనాలు నెలకొన్న అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ ఎట్టకేలకు డేట్ లాక్ చేసుకుంది. నవంబర్ 9న డిస్నీ హాట్ స్టార్ ద్వారా వరల్డ్ ప్రీమియర్ కాబోతోంది. నిజానికి ఇది సెప్టెంబర్ లోనే వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఐపిఎల్ సీజన్ వల్ల వ్యూస్ దెబ్బ తింటాయనే ఉద్దేశంతో ఏకంగా రెండు నెలలు వాయిదా వేశారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. సరిగా ఫైనల్ కు ఒక్క రోజు ముందు దీన్ని విడుదల చేయనుండటం విశేషం. తర్వాత చేసినా ఏమంత విశేషం లేదు కానీ కేవలం 24 గంటల ముందు ప్లాన్ చేసుకోవడం వెనుక మాత్రం ఏదో మర్మం ఉన్నట్టే ఉంది.

ఆ రోజు ఎలాంటి క్రికెట్ ఉండదు. ప్రేక్షకులు రిలాక్స్ మూడ్ లో ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఇలాంటి క్రేజీ మూవీని రిలీజ్ చేస్తే రెస్పాన్స్ బాగుంటుందన్న ఆలోచన కావొచ్చు. మొత్తానికి అక్కీ అభిమానుల కోరిక నెరవేరబోతోంది. ఇప్పటిదాకా హిందీలో చాలా ఓటిటి సినిమాలు వచ్చాయి కానీ స్టార్ ఇమేజ్ మార్కెట్ లెక్కల్లో చూసుకుంటే లక్స్మీ బాంబే పెద్దది. కానీ మన ఆడియన్స్ కి ఇది ఏమంత ఎగ్జైటింగ్ గా అనిపించే సబ్జెక్టు కాదు. ఎప్పుడో వచ్చిన కాంచన రీమేక్ కావడంతో కథ పరంగా ఎలాంటి ఆసక్తి లేదు. కేవలం అక్షయ్ కుమార్ యాక్టింగ్, కియారా అద్వానీ గ్లామర్ కోసం చూడాలి తప్పించి లారెన్స్ భారీ మార్పులు చేసినట్టుగా అయితే కనిపించడం లేదు.

ఒక హిజ్రా దెయ్యంగా మారి అమాయకుడైన హీరోను ఆవహించి తనను చంపిన విలన్ల మీద ప్రతీకారం తీర్చుకోవడం అనే పాయింట్ మీద రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ సౌత్ లో భారీ హిట్ గా నిలిచింది. అక్షయ్ ఏరికోరి మరీ రీమేక్ చేయించుకున్నాడు. సుమారు 125 కోట్లు కేవలం స్ట్రీమింగ్ హక్కుల కోసమే చెల్లించినట్టుగా దీని గురించి గత కొన్ని నెలలుగా టాక్ నడుస్తోంది. హాట్ స్టార్ సైతం ఇప్పుడీ ప్రసారం నుంచి చాలా ఆశిస్తోంది. సబ్స్క్రైబింగ్ అమౌంట్ తక్కువగా ఉండటంతో చందాదారులు ఎక్కువగా చేరుతారనే అంచనాలో ఉంది. దీని తర్వాత భుజ్, బిగ్ బుల్ విడుదలను షెడ్యూల్ చేస్తోంది హాట్ స్టార్. మరి లక్స్మీ బాంబ్ గా మారిన కాంచన నార్త్ ఆడియన్స్ ని ఎలా మెప్పించబోతోందో వేచి చూడాలి. తమిళ్ లో హిజ్రాగ నటించిన శరత్ కుమార్ స్థానంలో ఇందులో సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ శరద్ కేల్కర్ నటించినట్టు సమాచారం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp