సైకో కిల్లర్ తో అక్షయ్ ఢీ

By iDream Post Jun. 25, 2021, 04:39 pm IST
సైకో కిల్లర్ తో అక్షయ్ ఢీ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన రాక్షసుడు ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతోంది. అయితే తమిళం తెలుగు తరహాలో అక్కడ మీడియం రేంజ్ హీరో చేయడం లేదు. ఏకంగా అక్షయ్ కుమార్ నటించబోతున్నాడు. సైకో కిల్లర్ ని పట్టుకునే కథాంశంతో రట్ససన్ పేరుతో తమిళంలో దీన్ని రూపొందించిన తీరు అద్భుతమైన ప్రశంసలతో పాటు వసూళ్లను తెచ్చి పెట్టింది. తెలుగులోనూ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేశారు తప్ప ఎలాంటి మార్పులు చేయలేదు. సక్సెస్ కి అది కూడా ఒక కారణమని చెప్పొచ్చు. మొదటి నుంచి చివరి దాకా ఒకే ఉత్కంఠతో ఈ సినిమాని నడిపించిన విధానం ఏ హాలీవుడ్ మూవీకి తీసిపోదనటం అతిశయోక్తి కాదు.

హిందీలో దర్శకుడు ఎవరనే క్లారిటీ లేదు. టాలీవుడ్ వెర్షన్ ని డీల్ చేసిన రమేష్ వర్మకే ఛాన్స్ దక్కొచ్చని అంటున్నారు కానీ అదెంత వరకు నిజమో తెలియదు. మరోవైపు క్యాస్టింగ్ తదితర పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అత్యధిక సినిమాల హీరోగా అక్షయ్ కుమార్ స్పీడ్ మాములుగా లేదు. బెల్ బాటమ్, సూర్యవంశీ ఫస్ట్ కాపీలు సిద్ధంగా ఉండగా అత్ రంగీరే, రామ్ సేతు, రక్షా బంధన్, పృథ్విరాజ్ తదితరాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడీ రాక్షసుడు రీమేక్ తోడవుతోంది. ఇవి కాకుండా ప్రైమ్ కోసం నటిస్తున్న వెబ్ సిరీస్ కూడా ప్రొడక్షన్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.

ఈ మధ్య సౌత్ రీమేకుల మీద బాలీవుడ్ హీరోలు గట్టిగానే మనసు పారేసుకుంటున్నారు. నాంది, క్రాక్, ఉప్పెన, జాతి రత్నాలు లాంటి హిట్లన్నీ హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి. డబ్బింగ్ రూపంలో వీటిని యుట్యూబ్ లో రిలీజ్ చేసి సొమ్ములు చేసుకుంటున్నా సరే రీమేకులకు డిమాండ్ తగ్గడం లేదు. అన్నట్టు రాక్షసుడుకి సీక్వెల్ కూడా ప్లాన్ చేయబోతున్నారని చెన్నై టాక్ ఉంది కానీ దానికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాలి. ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేసిన ఇలాంటి థ్రిల్లర్ కు నార్త్ ఆడియన్స్ నుంచి ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందులోనూ అక్షయ్ చేస్తున్నాడంటే అంతకంటే హైప్ ఇంకేం కావాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp