ఊహించని పాత్రలో అఖిల్

By iDream Post Apr. 08, 2021, 10:59 am IST
ఊహించని పాత్రలో అఖిల్

డెబ్యూ చేసి ఆరో సంవత్సరంలో అడుగు పెట్టినా సక్సెస్ కోసం పట్టువదలకుండా ప్రయత్నిస్తున్న అక్కినేని అఖిల్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ని ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. సైరా నరసింహారెడ్డి తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి దీనికి డైరెక్టర్ కావడంతో అభిమానుల అంచనాలు అప్పుడే ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. ఏజెంట్ టైటిల్ తో పాటు విడుదల కూడా డిసెంబర్ 24 అని ముందే చెప్పేయడం మరో విశేషం. అంటే పక్కా ప్లానింగ్ తో ఎక్కడా ఆలస్యం జరక్కుండా సూరితో పాటు నిర్మాత అనిల్ సుంకర మొత్తం సెట్ చేసి పెట్టారని అర్థమవుతోంది. లుక్ మాత్రం మాసీగా ఉంది.

నిజానికి అఖిల్ ఇప్పటిదాకా కేవలం లవర్ బాయ్ పాత్రలకే పరిమితం కావాలనుకోవడమే విజయాన్ని ఆలస్యం చేసింది. ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని ట్రై చేస్తేనే తనలో నటుడికి అసలైన ఛాలెంజ్ దొరుకుతుంది. అందుకే పూర్తిగా గేర్ మార్చి మరీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో అఖిల్ పాత్ర షాడో తరహాలో దేశవిదేశాలు తిరుగుతూ దేశ రక్షణ కోసం పోరాడుతూ ఉంటుంది. ఊహించని మలుపులతో పాటు దేశభక్తిని కూడా ఇందులో సురేందర్ రెడ్డి చక్కగా మిక్స్ చేశారని సమాచారం. సిగరెట్ పట్టుకుని అఖిల్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే కరెక్టే అనిపిస్తుంది.

ఏజెంట్ కి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇటీవలి కాలంలో భీభత్సమైన ఫామ్ కొనసాగిస్తున్న తమన్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చేసింది. డిసెంబర్ రిలీజ్ అనౌన్స్ చేశారు కానీ షూటింగ్ మొత్తం అక్టోబర్ లోగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కినేని హీరోలకు డిసెంబర్ బాగా అచ్చి వచ్చిన నెల. ముఖ్యంగా నాగార్జునకు ఈ మంత్ లో సూపర్ హిట్లు బ్లాక్ బస్టర్లు పడ్డాయి. అందుకే ఏజెంట్ కు కూడా అదే సెంటిమెంట్ ని ఫాలో అయ్యారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వచ్చే జూన్ 19 రిలీజుకు రెడీ అవుతోంది. 2021లో అఖిల్ రెండు సినిమాలు కేవలం ఏడు నెలల గ్యాప్ లోనే రాబోతున్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp