Most Eligible Bachelor : అఖిల్ మొదటి హిట్టు గట్టిగానే పడింది

By iDream Post Oct. 18, 2021, 02:30 pm IST
Most Eligible Bachelor : అఖిల్ మొదటి హిట్టు గట్టిగానే పడింది

అంచనాలను మించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్సాఫీస్ ని మూడు రోజులు తన ఆధీనంలోకి తెచ్చేసుకుంది. మహా సముద్రం డిజాస్టర్ టాక్, పెళ్లి సందడి రొటీన్ ఫార్ములా వెరసి అఖిల్ కి బాగా కలిసి వచ్చాయి. కంటెంట్ పరంగా మరీ గొప్పగా లేనప్పటికీ, సెకండ్ హాఫ్ మీద కంప్లైంట్స్ ఉన్నప్పటికీ పబ్లిక్ వాటిని లైట్ తీసుకున్నారు. అందులోనూ లవ్ స్టోరీ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన సినిమా ఏదీ రాలేదు. ఉన్నంతలో ఇదే బెస్ట్ ఆప్షన్ గా కనిపించింది. దానికి తోడు దసరా పండగ మూడు రోజుల సెలవులు చాలా ప్లస్ అయ్యింది. చాలా చోట్ల సంక్రాంతి రేంజ్ హడావిడి బ్యాచిలర్ తో పాటు పెళ్లి సందడికి కూడా కనిపించడం గమనార్హం.

ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సుమారు 17 కోట్ల 19 లక్షల షేర్ రాబట్టింది. అఫీషియల్ గా చెప్పింది కాదు కానీ నెంబర్లు మాత్రం గట్టి ప్రచారంలో ఉన్నాయి. గ్రాస్ లెక్కలో చూసుకుంటే 29 కోట్ల దాకా వచ్చినట్టు. ఇంకో 1 కోటి 80 లక్షలు తెచ్చేసుకుంటే బ్రేక్ ఈవెన్ టచ్ చేసినట్టే. ఇదేమి అసాధ్యం కాదు. ఈజీగా వచ్చేస్తుంది. పెళ్లి సందడి హడావిడి ఎంత కనిపించినా ఈ రోజు నుంచి వీక్ డేస్ లో స్లో అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. హాలీవుడ్ మూవీ వెనమ్ 2 టాక్ కూడా ఏమంత లేదు. ఇక ఏరియాల వారీగా వసూళ్లు చేస్తే లెక్కలు ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ - 5 కోట్ల 40 లక్షలు
సీడెడ్ - 2 కోట్ల 93 లక్షలు
ఉత్తరాంధ్ర - 1 కోటి 66 లక్షలు
ఈస్ట్ గోదావరి - 85 లక్షల 50 వేలు
వెస్ట్ గోదావరి - 69 లక్షల 50 వేలు
గుంటూరు - 1 కోటి 3 లక్షలు
కృష్ణా - 80 లక్షలు
నెల్లూరు - 61 లక్షలు

ఏపి/తెలంగాణ 3 రోజుల మొత్తం షేర్ - 13 కోట్ల 98 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా - 1 కోటి 11 లక్షలు
ఓవర్సీస్ - 2 కోట్ల 10 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల షేర్ - 17 కోట్ల 19 లక్షలు

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ థియేట్రికల్ 19 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. రిపబ్లిక్, కొండపొలంలు ఫైనల్ రన్ కు దగ్గరగా వెళ్తున్న నేపథ్యంలో అఖిల్ కు ఇంకాస్త కలిసి వస్తుంది. అన్నిటి కన్నా ముఖ్యంగా ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. నాలుగైదు ఉన్నాయి కానీ దేనికీ అంతగా బజ్ లేదు. నాట్యం అంతో ఇంతో హైప్ తెచ్చుకున్నా కూడా ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియెన్స్ కి వచ్చే వీకెండ్ బ్యాచిలర్ ఒకటే ఆప్షన్ గా కనిపిస్తోంది. సో మళ్ళీ 29న వరుడు కావలెను వచ్చే దాకా గ్రౌండ్ లో ఉండే మేజర్ ప్లేయర్ అఖిల్ ఒక్కడే. అయ్యగారు హిట్టు కొట్టారనే స్లోగన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది

Also Read : Adbhutam Movie : నిర్మాతలు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp