బాలీవుడ్ వెళ్తున్న నాంది

By iDream Post Jun. 25, 2021, 01:00 pm IST
బాలీవుడ్ వెళ్తున్న నాంది

కరోనా సెకండ్ వేవ్ రాకముందు థియేటర్లు తెరిచిన టైంలో వచ్చిన అల్లరి నరేష్ నాంది విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. టీవీ ప్రీమియర్ లోనూ మంచి స్పందన దక్కించుకున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్తోంది. అది కూడా అజయ్ దేవగన్ ఒక సహనిర్మాతగా ఉండటం విశేషం. మరో ప్రొడ్యూసర్ గా దిల్ రాజు వ్యవహరించబోతున్నారు. ఈ ఇద్దరి కొలాబరేషన్ లో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే హీరోగా అజయ్ దేవగన్ నటిస్తాడా లేక ఇంకెవరైనా ఉంటారా అనే క్లారిటీ అందులో ఇవ్వలేదు. కేవలం జాయింట్ వెంచర్ అని మాత్రమే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొన్నారు

ఇవి కాకుండా విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందబోయే పాన్ ఇండియా సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రామ్ చరణ్ శంకర్ కాంబో మూవీ కూడా రేస్ లో ఉంది. తెలుగులో బిజీగా ఉంటూనే దిల్ రాజు ఇలా ఫోకస్ పెట్టడం విశేషం. ఇక ఆర్ఆర్ఆర్ తో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అజయ్ దేవగన్ తెలుగు సినిమాల మీద గట్టి కన్ను వేస్తున్నారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లో భాగమవ్వడం ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువవుతారన్న నమ్మకం ఆయనలో గట్టిగానే ఉంది. ఇప్పుడు నాందిని సొంతం చేసుకోవడం చూస్తే అదే అనిపిస్తోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp