సముద్రంలో చిక్కుకున్న దర్శకుడు

By Ravindra Siraj Feb. 04, 2020, 11:57 am IST
సముద్రంలో చిక్కుకున్న దర్శకుడు

సక్సెస్ ని మాత్రమే కొలమానంగా భావించే సినిమా పరిశ్రమలో ఒక్కోసారి దాన్ని అందుకున్న వాళ్లకు కూడా టైం కలిసి రాకపోతే పరిస్థితులు చాలా అనూహ్యంగా మారతాయి. దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. రెండేళ్ల క్రితం ఆరెక్స్ 100 అనే చిన్న సినిమాతో ఇతను రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. లవ్ స్టోరీనే ఒక డిఫరెంట్ యాంగిల్ లో హీరోయిన్ ని నెగటివ్ షేడ్ లో చూపించిన వైనం యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఫలితంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. అజయ్ పేరు మారుమ్రోగిపోయింది.

కేవలం రెండు నుంచి మూడు కోట్ల మధ్య తీసిన సినిమాకు ఏకంగా పదిహేను కోట్లకు పైగా వసూళ్లు రావడం ట్రేడ్ కి షాక్ ఇచ్చింది, దీని దెబ్బకు హీరో కార్తికేయ వరసగా సినిమాలు చేసుకుంటూ పోతు ఇప్పుడు ఏకంగా అజిత్ మూవీలోనే ఆఫర్ కొట్టేశాడు. మరోవైపు పాయల్ రాజ్ పుత్ హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా రవితేజ, వెంకటేష్ లాంటి సీనియర్లతోనూ జట్టు కడుతోంది. కానీ అజయ్ భూపతి కొత్త సినిమా మాత్రం పట్టాలు ఎక్కడం లేదు. మహా సముద్రం అనే టైటిల్ తో అతను రాసుకున్న డ్యూయల్ హీరో స్క్రిప్ట్ బడ్జెట్ కారణాల వల్లే లేట్ అవుతోందని చెబుతున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నాగ చైతన్యలతో మొదలుకుని శర్వానంద్ దాకా వచ్చిన ఈ సముద్రం ఫైనల్ గా ఎవరితో లాక్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు. హీరోయిన్ గా సమంతాను ఒప్పించినట్టు టాక్ ఉంది కానీ దాని గురించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. పోనీ జాను రిలీజ్ అయ్యాక ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. మహా సముద్రం ఇరవై కోట్లకు పైగా బడ్జెట్ ని డిమాండ్ చేయడం వల్లే ఏ నీరంతా వెంటనే ముందుకు రావడం లేదని కానీ ఖచ్చితంగా కార్యరూపం దాలుస్తుందని అజయ్ సన్నిహితులు అంటున్నారు. ఏది ఏమైనా ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఇలా స్క్రిప్ట్, బడ్జెట్ విషయాలకు కొత్త సినిమా ఇంత ఆలస్యం కావడం మూవీ లవర్స్ ఫీలయ్యేదే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp