పవన్ కళ్యాణ్ సెల్ నెంబర్ అడిగితే

By iDream Post Jun. 14, 2020, 06:27 pm IST
పవన్ కళ్యాణ్ సెల్ నెంబర్ అడిగితే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలవడమే అదో గొప్ప అచీవ్ మెంట్ గా భావిస్తారు అభిమానులు. అదే ఇండస్ట్రీలో ఉన్నవాళ్లకు నటిస్తే చాలానే ఫీలింగ్ ఉంటుంది. అది అందరికి నెరవేరదు కానీ మూడో సినిమాకే ఆయనతో చేస్తే ఛాన్స్ వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందో వేరే చెప్పాలా. అడవి శేష్ కి ఇది అనుభవమయ్యింది. క్షణం, గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న అడవి శేష్ కెరీర్ మొదలుపెట్టింది సొంతం సినిమాతో. చిన్న పాత్ర కావడంతో పాటు ఫలితం కూడా అంతంత మాత్రంగా రావడంతో రెండో మూవీ కర్మను తనే రాసుకుని నటించి తీసుకున్నారు.

అది వచ్చిన సంగతి కూడా పెద్దగా ఎవరూ గుర్తించలేదు కానీ ఆ తర్వాత పంజాలో పవన్ కళ్యాణ్ తో ఓ కీలకమైన పాత్రలో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం తలుపు తట్టింది. ఆ సమయంలోనే మొదటిసారి పవన్ ని కలిసిన శేష్ కు ఎదురైన ప్రశ్న నువ్వు అడవి బాపిరాజు గారి బంధువా అని. అవునని చెప్పగానే ఆయన రాసిన పుస్తకాలు వాటి గొప్పదనం గురించి చెబుతుంటే శేష్ తలూపుతూ ఔనని ఊ కొట్టడం తప్ప వేరే ఆప్షన్ లేకపోయింది. యూనిట్లో ఎవరి సౌకర్యానికి తగ్గట్టు వాళ్ళతో హిందీ, తమిళంలో మాట్లాడుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు శేష్. ఇక చివరి రోజు షూటింగ్ లో పవన్ ఫోన్ నెంబర్ అడగాలని శేష్ దగ్గరికి వెళ్తే కర్మ సినిమా గురించి మాట్లాడి చాలా బాగా తీశావని ఇలాంటి ప్రయత్నాలు మానకని చెప్పి ధైర్యం కలిగించారు.

మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా అంటే తన టీమ్ దగ్గర తీసుకోమని పవన్ చెప్పడంతో శేష్ అక్కడితో సైలెంట్ అయిపోయాడు. బుక్స్ చదవడం వల్ల పవన్ లో ఉన్న జ్ఞానాన్ని దగ్గరి నుంచి తెలుసుకున్నాడు శేష్. పంజా ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత బలుపు, రన్ రాజా రన్, బాహుబలి ది బిగినింగ్ లాంటి సినిమాలు అడవిలో శేష్ లోని పూర్తస్థాయి నటుడిని బయటపెట్టాయి. ఇక క్షణం తర్వాత జరిగింది ఇంకో మలుపు. ప్రస్తుతం మేజర్ చేస్తున్న శేష్ ఇది కూడా తనకు మెమరబుల్ మూవీ అవుతుందని చెబుతున్నాడు. ప్రఖ్యాత సోనీ సంస్థ భాగస్వామ్యంతో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఏదైతేనేం పవన్ కళ్యాణ్ తో ఒక మంచి ఎక్స్ పీరియన్స్ నిలిచిపోయింది అడవి శేష్కు. పంజా ఆడకపోయినా తన పెర్ఫార్మన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp