వాణివిశ్వనాథ్ కూతురు హీరోయిన్ అయ్యిందే.. !

By iDream Post Sep. 23, 2021, 05:45 pm IST
వాణివిశ్వనాథ్ కూతురు హీరోయిన్ అయ్యిందే.. !

తెలుగు సినీ హీరోయిన్ వాణి విశ్వనాథ్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మలయాళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ పాపులారిటీ తెచ్చుకున్న వాణి విశ్వనాథ్ ఆ తదనంతర కాలంలో తెలుగు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి సినిమాలు చేసి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

తెలుగులో కొదమసింహం, ఘరానా మొగుడు, గ్యాంగ్ మాస్టర్ లాంటి సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించి పేరు తెచ్చుకుంది. అయితే 94 తర్వాత ఆమెకు తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి, అయితే మలయాళంలో ఆమె బిజీ అయింది. అయితే అనుకోకుండా 2019 ఎన్నికలకు రెండు ఏళ్ళ ముందు ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి వాణి విశ్వనాథ్ స్పందిస్తూ నిజంగా తనకు టిడిపి నుంచి ఆహ్వానం అందిందని చెబుతూ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా అని కూడా ప్రకటించారు.

టిడిపి కండువా మెడలో వేసుకున్న తర్వాత వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసింది . తనకు నగరి సీటు వస్తుందని వాణి విశ్వనాథ్ భావించారు, కానీ మెడలో కండువాలు కప్పి పార్టీ ప్రచారం కోసం మాత్రమే సినీతారలను వాడుకోవాలని భావించే చంద్రబాబు ఆమెకు ఎప్పటిలానే హ్యాండ్ ఇచ్చి నగరిలో స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు సుధీర్ కి టికెట్ ఇచ్చారు. ఒకరకంగా అప్పటి నుంచి సైలెంట్ అయిపోయిన వాణి విశ్వనాథ్ ఈ ఏడాది ఈ ఏడాది జనవరిలో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. బీజేపీ నేతలు వెళ్లి ఆమెను కలవడంతో ఆమె బిజెపిలో చేరబోతున్నారని తిరుపతి ఉప ఎన్నికల్లో ఆమె చేత ప్రచారం చేయిస్తారని అన్నారు.

అయితే అదంతా ప్రచారానికే పరిమితం అయింది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆమె కుమార్తె హీరోయిన్ గా లాంచ్ అవుతోంది. ఈ రాజకీయాలు మనకు వర్కౌట్ కావు అనుకున్నారో ఏమో తెలియదు కానీ రాజకీయాల్లో సైలెన్స్ పాటిస్తూ తన కుమార్తెను హీరోయిన్ గా చేసుకునే పనిలో పడ్డారు ఆమె.

తెలుగులో ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు రాజీవ్ సాలూరు హీరోగా నటి వాణి విశ్వనాథ్‌ కుమార్తె వర్ష విశ్వనాథ్ హీరోయిన్ గా ఒక సినిమా రూపొందుతోంది. కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఈ మధ్యనే వైజాగ్‌లో స్టార్ట్ అయ్యింది. అయితే ఇంకేముంది నేను లోకల్ రోజాతో ఒక ఆట ఆడుకుంటాను అని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన వాణీ విశ్వనాధ్ తెలుగుదేశం పార్టీ దెబ్బకు రాజకీయాల్కు దూరమయ్యారు.

Also Read : శ్యామ్ సింగ రాయ్ డీల్ అయ్యిందా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp