నాట‌క‌రంగ కృషీవలుడు శ్రీ‌రాం లాగూ - Nostalgia

By G.R Maharshi Dec. 19, 2019, 03:45 pm IST
నాట‌క‌రంగ కృషీవలుడు శ్రీ‌రాం లాగూ - Nostalgia

డాక్ట‌ర్ శ్రీ‌రాంలాగూ , హిందీ సినిమా ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితం. తండ్రిగా, డాక్ట‌ర్‌గా, ప్రొఫెస‌ర్‌గా ఎన్నో క్యారెక్ట‌ర్ వేషాలు ధ‌రించిన లాగూ 92 ఏళ్ల వ‌య‌స్సులో పూణాలా మృతి చెందారు.
వృత్తిరీత్యా డాక్ట‌ర్‌గా (ఈఎన్‌టీ స్పెష‌లిస్ట్‌) ఉన్న ఆయ‌న , 40 ఏళ్ల వ‌య‌స్సులో పూర్తిస్ధాయి న‌టుడిగా మారారు. కెన్యాలో ప‌నిచేస్తూ , బోలెడు ఆదాయాన్ని వ‌దులుకుని మ‌రాఠీ నాట‌కంలోని పాత్ర‌గా రూపాంత‌రం చెందారు. మ‌రాఠీ నాట‌కాలు రెండు ర‌కాలుగా ఉంటాయి. బూతుల‌తో ఛీప్ కామెడీ సృష్టించేవి ఒక ర‌క‌మైతే, అభ్యుద‌య భావాల‌తో ఉండేవి రెండోర‌కం.

శ్రీ‌రాంలాగూ చ‌నిపోయే వ‌ర‌కు అభ్యుద‌యం వైపే నిలిచారు. అవినీతికి వ్య‌తిరేకంగా అన్నాహ‌జారే చేసిన ఉద్య‌మంలో ఆయ‌న‌ది ప్ర‌ముఖ‌పాత్ర‌. దేవుడిని న‌మ్మ‌ని ఆయ‌న , "దేవుడికి రిటైర్‌మెంట్" అవ‌స‌రం అని ఒక వ్యాసం రాస్తే అప్ప‌ట్లో అదో సంచ‌ల‌నం.

సినిమాల్లో వి శాంతారాం తీసిన పింజ్రా (1972) తో శ్రీ‌రాంలాగూ స‌క్సెస్ అందుకున్నారు. త‌ర్వాత క‌నీసం 200 సినిమాల్లో న‌టించి ఉంటారు. ఘ‌రోందా , ముకద్ద‌ర్‌కా సికంద‌ర్‌, లావారిన్ మొద‌లైన సినిమాల్లో ప్ర‌ముఖ పాత్ర‌లు వేశారు.

"లామాన్" పేరుతో ఆత్మ‌క‌థ రాసుకున్న శ్రీ‌రాంకి భార్య దీపాతో పాటు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. త‌న్వీర్ అని ఇంకో కుమారుడు దుర‌దృష్ట‌క‌రంగా చ‌నిపోయాడు. ఆయ‌న రైల్లో ప్ర‌యాణిస్తుండ‌గా ఆక‌తాయిలు విసిరిన రాయి నుదుటికి త‌గిలి మృతి చెందాడు.
క‌నీసం 20 నాట‌కాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆయ‌న చ‌నిపోయే వ‌ర‌కు మ‌రాఠీ నాట‌క‌రంగం కోసం త‌పించాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp