అన్నయ్య గురించి తెలియని విషయాలు

By iDream Post Aug. 20, 2020, 06:24 pm IST
అన్నయ్య గురించి తెలియని విషయాలు

క్రేజీ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడిగా 143 సినిమాతో తెరకు పరిచయమైన సాయిరామ్ శంకర్ లో టాలెంట్ ఎంత ఉన్నప్పటికీ టైంతో పాటు సరైన కథలను ఎంచుకోలేక ఇప్పటిదాకా స్టార్ గా సెటిల్ కాకపోవడం అభిమానులను బాధించే విషయమే. అయినా ఇండస్ట్రీలో మనుగడకు కొలమానంగా నిలిచేది సక్సెసే కాబట్టి అన్నయ్యతో పోల్చుకుంటే తాను వెనుకబడ్డ మాట వాస్తవం. సాయి రామ్ శంకర్ లోని ప్రతిభ గుర్తించే కృష్ణవంశి డేంజర్ లో అవకాశం ఇచ్చారు. అది ఆడకపోయినా యాక్టర్స్ కు పేరు వచ్చింది. నేనింతే ఆశించిన ఫలితం అందుకొకపోయినా మితిమీరిన అబిమాని పాత్రలో బాగా నటించడం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది.

వాస్తవానికి సాయి రామ్ హీరో కాకముందే పూరి దగ్గరే దర్శకత్వ శాఖలో పనిచేశాడు. అది పవన్ కళ్యాణ్ బద్రితోనే మొదలయ్యింది. మూడేళ్ళ పాటు శివమణి దాకా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఉంటూ ఎన్నో నేర్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా లాంచ్ కావాలన్న ఆలోచనకు సోదరుడి ప్రోత్సాహం లభించడంతో అలా కథానాయకుడు అయ్యాడు. విజయాల సంగతి పక్కనపెడితే ఇప్పటికీ సినిమాలు చేస్తున్న సాయిరామ్ శంకర్ కు పూరి అంటే భక్తి గౌరవం. అన్నయ్యగా కంటే ఒక డైరెక్టర్ గా నిర్మాతల డబ్బు వృధా కానివ్వకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన టైంలో సినిమాలు పూర్తి చేసి ఇవ్వడం పూరి నుంచి నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం అంటారు.

ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు తగినంత స్వేచ్చ ఇచ్చి ఏవైనా అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడు వాటికి అనుగుణంగా వేరేవి ప్లాన్ చేయడంలో కూడా పూరి దిట్ట. తమ్ముడిగా కంటే తండ్రిగా జాగ్రత్త చేసే పూరి అంటే అందుకే సాయిరామ్ శంకర్ కు అంత ప్రేమ. అన్న దగ్గర నేర్చుకున్న దర్శకత్వ మెళకువలు హీరోగా కథలు వినేటప్పుడు ప్రయోగిస్తే అసలుకే మోసం వస్తుందని ఆ కారణంగా తన ప్రమేయం లేకుండా కేవలం నటనకే పరిమితమవుతాడు శంకర్. ఈ అనుభవాలన్నీ తను స్వయంగా పంచుకున్నవే. ప్రస్తుతం సాయిరామ్ శంకర్ రెండు సినిమాలు చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల షూటింగులకు బ్రేక్ పడింది. త్వరలోనే పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంపర్ ఆఫర్ లాంటి కమర్షియల్ హిట్ ఉన్నా ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్ లేక పోరాడుతున్న సాయిరామ్ కు వచ్చే సినిమాలైనా టార్గెట్ రీచ్ చేయిస్తాయేమో చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp