శంకర్,కమల్ ఇండియన్ 2 షూటింగ్ లో తీవ్ర ప్రమాదం : 3 మృతి

By Ravindra Siraj Feb. 20, 2020, 07:40 am IST
శంకర్,కమల్  ఇండియన్ 2 షూటింగ్ లో తీవ్ర ప్రమాదం : 3 మృతి
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఇండియన్ 2 షూటింగ్ లో పెను ప్రమాదం జరిగింది. చెన్నై నగర శివారులోని పూందమల్లి ప్రాంతంలో ఉన్న ఈవిపి స్టూడియోలో కమల్ హాసన్ తో సహా ఇతర తారాగణంతో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సెట్ లో ఉన్న ఓ టెంట్ లో శంకర్ తన టీమ్ తో కూర్చుని రషెస్ ని పర్యవేక్షిస్తున్న సమయంలో 150 అడుగులున్న క్రేన్ ఒకటి హఠాత్తుగా కిందకు నేరుగా టెంటుపైకి పడిపోయింది. 

దీంతో అక్కడిక్కడే ఇద్దరు దుర్మరణం పాలు కాగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ప్రాణాలు వదిలారు. శంకర్ కు సైతం తీవ్ర గాయాలై కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. ఆయన వైద్యుల పయవేక్షణలో ఉన్నారు. చనిపోయిన వారిలో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణలతో పాటు అక్కడి వారికి క్యాటరింగ్ చేసే బృందంలోని చంద్రన్ అనే వ్యక్తి ఉన్నట్టు తెలిసింది.

శంకర్ పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్టు, అత్యున్నత వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు హాస్పిటల్ నుంచి వస్తున్న అప్ డేట్. తీవ్రంగా గాయపడిన మరో 10 మందికు చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలు పోలీస్ వారు విచారిస్తున్నారు. సంఘటన పట్ల తమిళనాడుతో పాటు తెలుగు సినిమా ప్రేమికులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సెట్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునే శంకర్ కు ఇలా జరగడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. శంకర్ తో సహా మిగిలిన వారూ త్వరగా కోలుకుని బయటికి రావాలని అందరూ . ప్రార్థిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో సెట్ లో ఉన్న హీరో కమల్ హాసన్ దగ్గరుండి మరీ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు. జరిగిన విషాదం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp