నమ్మకాన్ని దెబ్బ తీసిన దర్శకుడు

By iDream Post May. 12, 2020, 07:15 pm IST
నమ్మకాన్ని దెబ్బ తీసిన దర్శకుడు

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ఆదర్శ్ బాలకృష్ణ చేసినవి చిన్న పాత్రలే అయినా తనదైన టైమింగ్ తో గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. యాక్టర్ గానే కాక బిగ్ బాస్ సీజన్ 1 పార్టీసిపెంట్ గానూ ఇతనికి గుర్తింపు వచ్చింది. రామ్ చరణ్ తో స్కూల్ వయసులోనే క్రికెట్ ఆడిన అనుభవమున్న ఆదర్శ్ బాలకృష్ణ నటన మీదున్న నమ్మకాన్ని సమూలంగా దెబ్బ తీసిన దర్శకుడు ఒకరున్నారు. ఆయనే కృష్ణవంశీ. గోవిందుడు అందరివాడేలే షూటింగ్ జరుగుతున్న సమయంలో అసలు నటనంటే ఇది కాదని ఇలా అయితే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండటం కష్టమని కృష్ణవంశీ గట్టిగానే చెప్పేవారట.

అప్పటిదాకా తానేదో బాగా యాక్ట్ చేస్తున్నానుకుంటున్న ఆదర్శ్ బాలకృష్ణకు మొదటిసారి జ్ఞానోదయం అయ్యింది. అప్పటికే కొందరు స్నేహితులు ఆయనతో చేస్తే ఇంకెలాంటి స్పెషల్ కోచింగ్ అక్కర్లేదని స్పాట్ లోనే గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చని చెప్పడంతో ఆదర్శ్ కు కృష్ణవంశీ టేకింగ్ లోని మహత్యం అర్థమయ్యింది. అందులోనూ రామ్ చరణ్ తో పాటు ప్రకాష్ రాజ్, జయసుధ లాంటి సీనియర్లతో నటించే అవకాశం రావడం ఇతనికి ఇంకా పెద్ద ప్లస్ అయ్యింది. క్రికెట్ లో మంచి పేరున్న ఆదర్శ్ బాలకృష్ణ ఈ మధ్య తెరపై ఎక్కువగా కనిపించడం లేదు.

తనకంటూ బ్రేక్ ఇచ్చే పాత్ర దొరికితే చెలరేగిపోతానని చెబుతున్న ఆదర్శ్ ఇప్పటిదాకా తెలుగులో అధిక శాతం స్టార్ హీరోల సినిమాల్లో చేశాడు. అరవింద సమేత వీర రాఘవ, అశ్వద్ధామ, చాణక్య, గరుడవేగా, సరైనోడు, బాడీ గార్డ్ తదితర చిత్రాలు పేరు తీసుకొచ్చాయి. హీరో ఫీచర్స్ ఉన్నప్పటికీ ఎందుకో ఆదర్శ్ బాలకృష్ణకు నిజంగా రావాల్సిన బ్రేక్ ఇంకా దక్కలేదు. ప్రస్తుతం ఓ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఆదర్శ్ విలన్ గానూ ఆర్టిస్ట్ గానూ పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు. రెండు కన్నడ సినిమాలతో పాటు తన కెరీర్ డెబ్యూని హిందీతో మొదలుపెట్టిన ఆదర్శ్ ఇప్పటిదాకా అధికశాతం తెలుగు సినిమాల్లోనే నటించడం విశేషం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp