అల్లు అర్జున్ 21కి పర్ఫెక్ట్ కాంబో - ఆఫీషియల్

By iDream Post Jul. 31, 2020, 01:37 pm IST
అల్లు అర్జున్ 21కి పర్ఫెక్ట్ కాంబో - ఆఫీషియల్

లాక్ డౌన్ వల్ల పుష్ప షూటింగ్ బ్రేక్ వేసుకున్న అల్లు అర్జున్ తన కొత్త సినిమా ప్రకటించాడు. వరసగా బ్లాక్ బస్టర్ దర్శకులనే సెట్ చేసుకుంటున్న బన్నీ ఈసారి పరాజయమెరుగని సెన్సషనల్ డైరెక్టర్ కొరటాల శివతో టై అప్ అయ్యాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ తో కలిసి యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోయే ఈ సినిమాకు సుధాకర్ మిక్కిలినేని మెయిన్ ప్రొడ్యూసర్ గా నిలుస్తున్నారు. ఈయన శివకు అత్యంత సన్నిహిత మిత్రుడు. దీనికి సంబంధించిన థీమ్ పోస్టర్ ని కొరటాల శివ అధికారికంగా విడుదల చేశారు. ఈ ప్రకటన తాలూకు వార్త నిన్నటి నుంచే చక్కర్లు కొడుతున్నప్పటికీ అఫీషియల్ గా ఇప్పుడు బయటికి వచ్చేసింది.

ప్రీ లుక్ లో ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వలేదు కానీ సముద్ర ప్రాంతం, దాని ఒడ్డు, సుదూరంగా ఏదో ఊరు, నీటి మధ్యలో నిలబడి చూస్తున్న రెండు పాత్రలు మొత్తానికి ఏదో ఆసక్తికరంగానే డిజైన్ చేశారు. తన ప్రతి మూవీలో మెసేజ్ ఉండేలా చూసుకునే కొరటాల ఇందులో కూడా అలాంటి బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆచార్య ఫినిష్ చేశాక దీని తాలూకు పనులు.యూ వేగవంతం చేయబోతున్నారు.
విడుదల 2022లోనే అని స్పష్టంగా చెప్పేసి క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప పూర్తవ్వడానికి ఎంతలేదన్నా వచ్చే ఏడాది వేసవి అయ్యేలా ఉంది. విడుదల దసరాకు ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు.

కాబట్టి ఇది 2021లో వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవు. మరోవైపు కొరటాల శివ సైతం ఆచార్య బాలన్స్ పనులు ఇంకా చాలా పూర్తి చేయాల్సి ఉంది. శివ, బన్నీ ఇంచుమించు ఒకేసారి ఫ్రీ అవుతారు కాబట్టి ఈ AA21కి కరెక్ట్ టైం సెట్ అవుతుంది. హీరోయిన్ ఎవరనే లీక్ ఇంకా బయటికి రాలేదు. సంగీత దర్శకుడు ఎవరనే విషయం కూడా ఖరారు కాలేదు. దేవిశ్రీ ప్రసాద్-థమన్-మణిశర్మ ఈ ముగ్గురిలో ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. ధృవీకరించదానికి ఇంకా టైం పడుతుంది. ఇప్పటిదాకా ప్రభాస్-మహేష్ బాబు-జూనియర్ ఎన్టీఆర్-చిరంజీవిలను డైరెక్ట్ చేసిన కొరటాల ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్ టేకప్ చేయడంతో అభిమానుల అంచనాలు అప్పుడే ఓ రేంజ్ లో ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp