బన్నీ సినిమాలో ఊహించని మలుపు

By iDream Post Jul. 05, 2021, 11:44 am IST
బన్నీ సినిమాలో ఊహించని మలుపు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప మీద ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏకంగా ఐఎండిబిలో కూడా దీని మీద ఆసక్తి చూపిస్తున్న వాళ్ళ సంఖ్య పరంగా నెంబర్ వన్ ప్లేస్ ఉండటం ఏ స్థాయి హైప్ ఉందో చెప్పకనే చెబుతోంది. దానికి తోడు బాహుబలి రేంజ్ లో రెండు భాగాలు ప్లాన్ చేయడం కూడా అంచనాలను పెంచుతోంది. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే ఈ పాటికి ముప్పాతిక షూట్ పూర్తయిపోయి ఉండేది. ముందు అనుకున్న ఆగస్ట్ విడుదల కూడా సాధ్యం కాదు కాబట్టి కొత్త రిలీజ్ డేట్ గురించి చర్చలు జరుగుతున్నట్టు అప్ డేట్

ఇక అసలు విషయానికి వస్తే ఇందులో విలన్ గా ఫహద్ ఫాసిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఒక కీలకమైన లీక్ ఒకటి ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. దీని ప్రకారం ఫస్ట్ పార్ట్ లో విలన్ గా సునీల్ కనిపిస్తాడట. ప్రీ క్లైమాక్స్ కు కాసేపటి ముందు ఫహద్ ఎంట్రీతో ఒక టచ్ ఇచ్చి అతన్ని పూర్తి విలన్ గా సీక్వెల్ లో చూపించబోతున్నట్టు తెలిసింది. అంటే ఇద్దరు విలన్లు రెండు భాగాలకు వేర్వేరుగా ఉంటారన్న మాట. అయితే సునీల్ అంత హెవీ క్యారెక్టర్ ని నిజంగా మోయగలడా లేక సుకుమార్ తనను స్పెషల్ గా చూపించబోతున్నాడా అనేది రిలీజ్ అయ్యాక కానీ క్లారిటీ రాదు.

పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న పుష్పకి వివిధ భాషల్లో క్రేజ్ తెచ్చేందుకు పక్కా మార్కెటింగ్ ప్లాన్ సిద్ధమవుతోందని ఇన్ సైడ్ న్యూస్. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిన సుకుమార్ దీంతో దాన్ని మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కసితో చాలా కష్టపడుతున్నారు. మరి పుష్ప 1 తర్వాత కొంత గ్యాప్ తీసుకుని 2 చేస్తారా లేక మొన్న ప్రచారంలోకి వచ్చినట్టు ఐకాన్ లాంటి ఇంకో సినిమా ఏదైనా చేసి అప్పుడు సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్తారా అనేది వేచి చూడాలి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్పకు దేవిశ్రీ ప్[ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp