లైగర్ కోసం పద్దెనిమిదేళ్ల ఫార్ములా

By iDream Post Feb. 23, 2021, 02:32 pm IST
లైగర్ కోసం పద్దెనిమిదేళ్ల ఫార్ములా

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న లైగర్ షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో కొనసాగుతోంది. లాక్ డౌన్ అయ్యాక చాలా గ్యాప్ తీసుకున్న టీమ్ ఇప్పుడు స్పీడ్ పెంచేశారు. కీలకమైన సన్నివేశాలన్నీ ముంబై షెడ్యూల్ లో పూర్తి చేయబోతున్నారు. మహారాష్ట్రలో కరోనా మళ్ళీ పడగ విప్పడంతో వీలైనంత త్వరగా ఫినిష్ చేసేందుకు పూరి సర్వ సన్నద్ధంగా ఉన్నట్టు ముంబై రిపోర్ట్. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న లైగర్ ద్వారా అనన్య పాండే హీరోయిన్ గా పరిచయమవుతుండగా ఇదివరకే విడుదల తేదీని సెప్టెంబర్ 9 అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక అసలు విషయానికి వస్తే ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఆవిడ విజయ్ కు తల్లిగా నటిస్తున్నారట. అయితే పద్దెనిమిదేళ్ల క్రితం 2003లో వచ్చిన అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో వాడిన మదర్ సెంటిమెంట్ ని లైగర్ లో ఇంకో కొత్త కోణంలో పూరి ఆవిష్కరించబోతున్నట్టు సమాచారం. హీరో తల్లితండ్రులకు సంబంధించి ఒక షాకింగ్ ట్విస్ట్ ప్రేక్షకులు ఊహించని విధంగా ఉంటుందని అందుకే క్యాప్షన్ సాలా క్రాస్ బ్రీడ్ అని పెట్టారని ఇన్ సైడ్ న్యూస్. బాక్సింగ్ సెటప్ కూడా అందులో లాగే లైగర్ లో కూడా ఉండటం గమనార్హం.

ఎంత హీరోయిజం చూపించినా ఎమోషన్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకునే పూరి ఇందులో కూడా అన్నీ బాలన్స్ అయ్యేలా రాసుకున్నట్టు టాక్. ఇస్మార్ట్ శంకర్ గాలివాటం హిట్ కాదని తనలో మునుపటి ఫామ్ వచ్చేసిందని ప్రూవ్ చేయడానికి లైగర్ సక్సెస్ పూరికి చాలా అవసరం. అటు విజయ్ దేవరకొండ కూడా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ చేసిన డ్యామేజ్ నుంచి రికవర్ అవ్వాలంటే లైగర్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అందులోనూ ఇది బాలీవుడ్ మీద కన్నేసి మరీ చేసినది. అంతా బాగానే ఉంది కానీ ఇప్పటిదాకా లైగర్ సంగీత దర్శకుడెవరో ఇంకా ఫైనల్ చేయలేదు. ఎవరిని అనుకుంటున్నారో కనీసం క్లూ కూడా లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp