రేపు కలర్ఫుల్ ఫ్రైడేనే కానీ ....

By iDream Post Mar. 04, 2021, 03:36 pm IST
రేపు కలర్ఫుల్ ఫ్రైడేనే కానీ ....

ఇంకో శుక్రవారం వచ్చేసింది. బుక్ మై షో లేదా పే టిఎం యాప్ ఓపెన్ చేసి ఏదైనా కొత్త సినిమా చూద్దామంటే కుప్పలుగా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. కానీ అడ్వాన్ బుకింగ్ లో దేనికీ కనీసం హౌస్ ఫుల్స్ పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. తెలుగు, హిందీ ఇంగ్లీష్ అన్నీ కలిపి రేపు పదిహేను దాకా టికెట్ కౌంటర్ల మీద దాడి చేయబోతున్నాయి. అలా అని కన్ఫ్యూజ్ అయిపోయి ఏది చూడాలో తెలియని గందరగోళంలో ఎవరూ పడటం లేదు. ఎందుకంటే అధికశాతం వాటికి కనీస బజ్ కూడా లేదు. అసలు థియేటర్లకు అవి వస్తున్నాయన్న అవగాహన కూడా సామాన్య ప్రేక్షకుడికి లేదనడంలో అబద్దమేమీ లేదు.

అంతో ఇంతో ఆకర్షిస్తున్నవి సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్, రాజ్ తరుణ్ ల పవర్ ప్లేలు మాత్రమే. కానీ ఈ ఇద్దరి మార్కెట్ బాగా డౌన్ లో ఉన్న నేపథ్యంలో పబ్లిక్ టాక్ తో పికప్ అవ్వాల్సిందే తప్ప ఇప్పటికిప్పుడు భారీ ఓపెనింగ్ వచ్చే సీన్ అయితే కనిపించడం లేదు. ఏ1 ఎక్స్ ప్రెస్ టీమ్ ప్రమోషన్లు గట్టిగానే ఉన్నప్పటికీ ఎందుకో బయట అంత బజ్ కనిపించడం లేదు. ఏదైనా వైరల్ సాంగ్ లాంటిది హెల్ప్ అయ్యిందా అంటే అదీ జరగలేదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ రీమేక్ జాతకం రేపు మధ్యాన్నం తేలిపోతుంది . ఇక చాలా వేగంగా షూటింగ్ జరుపుకున్న పవర్ ప్లే తన కెరీర్ లో మొదటి కంటెంట్ బేస్డ్ మూవీ అంటున్నాడు రాజ్ తరుణ్.

ఇవి కాకుండా రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్, ప్లే బ్యాక్, ఏ ఇన్ఫినిటం, తోటబావి, పరమానందయ్య శిష్యుల కథ కూడా రిలీజవుతున్నాయి. బాగా బిల్డప్ ఇస్తున్న దేవినేనికి సైతం ప్రీ హైప్ సున్నానే. దిల్ రాజు నిర్మించిన షాదీ ముబారక్ మీద అంచనాలు లేవు. టీవీ నటుడు సాగర్ హీరో అందులోనూ ఎప్పుడో పూర్తయిన సినిమా కావడంతో అద్భుతాలు ఆశించడం అత్యాశే. ఇవి కాకుండా డబ్బింగ్ సినిమాలు గజకేసరి, విక్రమార్కుడు కేవలం యష్-విజయ్ సేతుపతిల క్రేజ్ ని వాడుకోవడం కోసం విడుదల చేస్తున్నారు. అసలు ఇన్నేసి సినిమాలు వస్తున్నా బాక్సాఫీస్ డల్ గా కనిపించడం చూస్తే ఇంకో వారం ఉప్పెన పండగ చేసుకోవడం ఖాయమే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp