ఫైనల్ ఫిగరూ చాలా బెటరూ - క్లోజింగ్ కల్లెక్షన్స్

తొమ్మిది నెలల సుదీర్ఘమైన లాక్ డౌన్ తర్వాత వచ్చిన మొదటి తెలుగు స్ట్రెయిట్ మూవీగా సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటరూ ఎట్టకేలకు ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. సంక్రాంతికి కొద్దిరోజుల ముందే బాగా స్లో అయిన ఈ సినిమా పండగ చిత్రాలు రాగానే కొన్ని ఏ సెంటర్స్ మినహాయించి మిగిలిన అన్ని చోట్ల సెలవు తీసుకుంది. అందులోనూ జనవరి 1 నుంచి పే పర్ వ్యూ మోడల్ లో జీ ప్లెక్స్ ఓటిటి స్ట్రీమింగ్ చేయడం కూడా కొంత ప్రభావం చూపించింది. ఈ 25న జీ 5 చందాదారులు అందరికీ అదనపు రుసుము లేకుండా సోలో బ్రతుకే సో బెటరూ అందుబాటులోకి రానుంది. బోణీ అయితే బాగుందనిపించేలా వసూళ్లు నమోదయ్యాయి.
సుమారు 9 కోట్ల 60 లక్షల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న సోలో బ్రతుకే సో బెటరూ ట్రేడ్ నుంచి అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు 12 కోట్ల 60 లక్షల దగ్గర తన బాక్సాఫీస్ ప్రయాణాన్ని ముగించింది. అంటే 3 కోట్లకు పైగా లాభాలన్న మాట. నిజానికి ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు. జస్ట్ ఎబోవ్ యావరేజ్ దగ్గర ఆగిపోయింది. సెకండ్ హాఫ్ లో ఉన్న మైనస్సులు ఇంకా గొప్ప ఫలితాన్ని అందుకోకుండా అడ్డుపడ్డాయి. లేదంటే ప్రతి రోజు పండగే స్థాయిలో స్పందన దక్కేది. సగం సీటింగ్ నిబంధనను చాలా కేంద్రాల్లో కఠినంగా పాటించడం కూడా టోటల్ రెవిన్యూ మీద ప్రభావం చూపించింది. ఇక ఏరియాల వారీగా నమోదయిన ఫైనల్ ఫిగర్స్ ఏంటో చూద్దాం.
సోలో బ్రతుకే సో బెటర్ ఫుల్ రన్ వసూళ్లు:
ఏరియా | షేర్ |
నైజాం | 4.25cr |
సీడెడ్ | 2.10cr |
ఉత్తరాంధ్ర | 1.58cr |
గుంటూరు | 0.97cr |
క్రిష్ణ | 0.69cr |
ఈస్ట్ గోదావరి | 0.96cr |
వెస్ట్ గోదావరి | 0.60cr |
నెల్లూరు | 0.53cr |
ఆంధ్ర+తెలంగాణా | 11.67cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.55cr |
ఓవర్సీస్ | 0.38cr |
ప్రపంచవ్యాప్తంగా | 12.60cr |
అందరికీ ఎప్పటికీ మర్చిపోలేని పీడకలగా నిలిచిన 2020 చివర్లో మాత్రం సోలో బ్రతుకే సో బెటరూ రూపంలో ఇలాంటి ఫలితం దక్కడం ఊరట కలిగించేదే. నిజానికి దీనికి వచ్చిన స్పందన చూసే మిగిలిన నిర్మాతలు ధైర్యం చేసి తమ విడుదల తేదీలు ప్రకటించారు. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు ఎంత సిద్ధంగా ఉన్నారో ముందు ఋజువు చేసింది ఈ సినిమానే. మొదటి వారంలో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం పరిశ్రమ వర్గాల్లో ఆనందం నింపింది. ఇప్పుడీ సోలో బ్రతుకే సో బెటరూ ప్లస్ సంక్రాంతి చిత్రాలు ఇచ్చిన జోష్ తో 2022లో ఎన్నో సినిమాలు రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి
Verdict: HIT


Click Here and join us to get our latest updates through WhatsApp