'రెడ్'బుల్ ఎనర్జీ - ఫస్ట్ వీక్ వసూళ్లు

అభిమానులు ఎనర్జిటిక్ స్టార్ గా పిలుచుకునే రామ్ కొత్త సినిమా రెడ్ టాక్ ఎలా ఉన్నా వసూళ్లు మాత్రం ఘనంగా ఉన్నాయి. క్రాక్ తో సమానంగా కాకపోయినా ఇంచుమించు చాలా దగ్గరగా వెళ్తోంది. ఈజీగా 17 కోట్ల మార్కును దాటేసి బయ్యర్లకు లాభాలను ఇవ్వడం అయిదో రోజు నుంచే మొదలుపెట్టింది. సగం సీట్లతోనే ఇంత అనూహ్యమైన వసూళ్లు రాబట్టడం చూస్తే తెలుగు వాళ్లకు సినిమా తమ జీవితంలో ఎంత అంతర్భాగం అయ్యిందో చూడొచ్చు. వీక్ డేస్ లో నెమ్మదించిన రెడ్ కు రెండు అంశాలు కలిసొస్తున్నాయి. ఒకటి మాస్టర్ ఫలితం. రెండోది అల్లుడు అదుర్స్ డిజాస్టర్ టాక్. ఆ రెండూ వద్దనుకుంటున్న వాళ్లకు క్రాక్ తర్వాత రెడ్ ఒకటే ఆప్షన్ మిగిలింది.
దీన్ని ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తో పోల్చలేం. ఇది వేరే. కాకపోతే ఇలాంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఆడియన్స్ ని యునానిమస్ గా మెప్పించలేకపోయినా ఇంత కలెక్షన్లు రావడం మాత్రం గొప్ప విషయమే. కమర్షియల్ కోణంలో చూస్తే రెడ్ ని హిట్ గానే పరిగణించాల్సి ఉంటుంది. ఇంకెంత రన్ వస్తుందనేది శనివారం విడుదల కాబోయే బంగారు బుల్లోడు ఫలితాన్ని బట్టి ఉంటుంది. అది మరీ తీవ్ర ప్రభావం చూపిస్తుందనేది చెప్పలేం కానీ టాక్ పాజిటివ్ వస్తే ఫామిలీస్ ని అటువైపు లాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏరియాల వారీగా మొదటి వారం వసూళ్లను రెడ్ ఈ విధంగా నమోదు చేసింది.
ఏరియా వారి మొదటి వారం వసూళ్లు :
ఏరియా | షేర్ |
నైజాం | 6.01cr |
సీడెడ్ | 3.02cr |
ఉత్తరాంధ్ర | 1.87cr |
గుంటూరు | 1.13cr |
క్రిష్ణ | 1.04cr |
ఈస్ట్ గోదావరి | 1.39cr |
వెస్ట్ గోదావరి | 1.42cr |
నెల్లూరు | 0.81cr |
ఆంధ్ర+తెలంగాణా | 16.69cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.72cr |
ఓవర్సీస్ | 0.33cr |
ప్రపంచవ్యాప్తంగా | 17.74cr |
థియేట్రికల్ రిలీజ్ కోసమే ఏడాది ఎదురు చూసిన రెడ్ కు మొత్తానికి ఆశించిన ఫలితం దక్కింది. నిర్మాత పరంగా చూసుకుంటే రేపు మలయాళం వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంత రెవిన్యూ యాడ్ అవుతుంది. హిందీలోనూ డబ్బింగ్ వెర్షన్ ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేశారు. అయితే యుట్యూబ్ లో తడం హిందీ డబ్బింగ్ ని ఇప్పటికీ నలభై మిలియన్ల దాకా చూశారు. మరి అదే కథని పెద్దగా మార్పులు లేకుండా తీసిన రెడ్ ని నార్త్ ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి చూస్తారా అనేది అనుమానమే. అయినా బ్రేక్ ఈవెన్ అయ్యాక వస్తున్నవన్నీ లాభాలే కాబట్టి ఇంకే విషయంలోనూ రెడ్ టెన్షన్ పడాల్సిన అవసరం కనిపించడం లేదు.


Click Here and join us to get our latest updates through WhatsApp