ఆరంభం అదిరింది : రెడ్ కలెక్షన్లు

ఓటిటి ఆఫర్లు ఎంత టెంప్ట్ చేసినా ప్రేక్షకులకు తన సినిమాను ధియేటర్లలోనే చూపించాలన్న రామ్ ఎట్టకేలకు తన కోరికను తీర్చుకున్నాడు. భారీ పోటీ, మంచి అంచనాల మధ్య రెడ్ హాళ్ళలో అడుగు పెట్టింది. టాక్ డివైడ్ గా ఉన్నప్పటికీ హాలిడేస్ ప్లస్ వీకెండ్ కావడంతో వసూళ్లు మాత్రం బాగున్నాయి. రామ్ తన అఫీషియల్ ట్వీట్ లో ఆరు కోట్లకు పైగా షేర్ వచ్చిందని పేర్కొన్నాడు.
దీంతో ఇప్పుడు అందరి దృష్టి అటువైపు వెళ్తోంది. సాధారణంగా హీరోలు ఇలా మొదటి రోజు ఫిగర్స్ గురించి చెప్పుకోవడం అరుదు. కానీ ఈ మధ్యకాలంలో పోటీ వల్ల ఇలా చేయక తప్పడం లేదు. ఇవన్ని వీళ్ళు అధికారికంగా ప్రకటిస్తూ ఉండటంతో ఇవి కాస్తా అభిమానులకు ధృవీకరించిన సమాచారంగా వెళ్ళిపోతున్నాయి. ఏది ఏమైనా రెడ్ ఓపెనింగ్ బాగుంది. ఏరియాల వారిగా చూస్తే లెక్కలు ఈ విధంగా నమోదయ్యాయి.
- ఏరియా వారీగా మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 2.04cr |
సీడెడ్ | 1.10cr |
ఉత్తరాంధ్ర | 0.49cr |
గుంటూరు | 0.42cr |
క్రిష్ణ | 0.32cr |
ఈస్ట్ గోదావరి | 0.36cr |
వెస్ట్ గోదావరి | 0.46cr |
నెల్లూరు | 0.27cr |
Total Ap/Tg | 5.47cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.40cr |
ఓవర్సీస్ | 0.18cr |
ప్రపంచవ్యాప్తంగా | 6.05cr |
ఇవి చాలా భారీ ఫిగర్లనే చెప్పొచ్చు. ఊహించని విధంగా 14న అల్లుడు అదుర్స్ తో పోటీ పడి స్క్రీన్లు పంచుకోవాల్సి వచ్చినా రెడ్ వైపే అధిక శాతం ఆడియన్స్ మొగ్గు చూపారు. ఇప్పుడు ఈ మూడు రోజులు రెడ్ కు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేయాల్సిన సినిమాగా కాదని రెడ్ మీద కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏ మేరకు స్ట్రాంగ్ గా నిలుస్తుందన్నది వేసి చూడాలి. మాస్టర్ డిజాస్టర్ ఫలితం, అల్లుడు అదుర్స్ నెగటివ్ టాక్ రెడ్ కు ఏమైనా ఉపయోగపడితే మంచిదే. కానీ క్రాక్ ని క్రాస్ చేసే ఛాన్స్ లేనట్టే.అయితే రెడ్ విషయంలో స్మార్ట్ రికార్డులు బద్దలు కావన్నది మాత్రం వాస్తవం.


Click Here and join us to get our latest updates through WhatsApp