iDreamPost

సెంటున్నరలో ఇంటికి కేంద్రం నుండి ఉత్తమ గృహ అవార్డు – ఇప్పుడు ఏమంటుందో రాష్ట్ర బీజేపీ.

సెంటున్నరలో ఇంటికి కేంద్రం నుండి ఉత్తమ గృహ అవార్డు – ఇప్పుడు ఏమంటుందో రాష్ట్ర బీజేపీ.

2018 లో అద్దంకి పట్టణానికి చెందిన ఆనంతలక్ష్మి అనే మహిళ సొంత ఇంటి నిర్మాణం కోసం అప్పటి టీడీపీ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా ఎన్టీఆర్ రూరల్ స్వగృహ , ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఉమ్మడి పథకంలో ఇంటి నిర్మాణానికి సబ్సిడీ అందించారు . ఈ పథకంలో లబ్ధిదారులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా లక్షన్నర వరకూ సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా కేంద్ర వాటా డెబ్భై వేలు కేంద్రం ఇవ్వగా రాష్ట్ర వాటా కింద ఇవ్వాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఇవ్వకుండా కొన్ని ఇళ్లకు mgnregs పధకం కింద గృహ యజమాని ఇటుకలు తయారుచేసుకొన్నట్టు , తాపీ మేస్త్రిగా ఇల్లు నిర్మించుకొన్నట్టు చూపి రాష్ట్ర వాటా కూడా కేంద్రాన్ని వంచించి ఖర్చు బెట్టించారు

ఏదేమైనా కేంద్ర నిధులతో సెంటున్నర స్థలంలో అనంత లక్ష్మీ నిర్మించుకున్న ముచ్చటైన గృహం PMAY పధకం క్రింద నిర్మించుకున్న ఉత్తమ గృహాల్లో ఒకటిగా ఎంపికైంది . వచ్చే జనవరి ఒకటిన ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే కాన్ఫరెన్స్ మీటింగ్లో పాల్గొని ప్రధాని నుండి అభినందనలు పొందబోతుంది . ఇంతవరకూ అంతా బాగానే ఉంది . రాష్ట్ర బీజేపీ కూడా సంతోషించాల్సిన విషయమే .

అయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇళ్ళు లేని పేద వారికి దేశంలో ఇప్పటివరకు ఎక్కడా చేయని విధంగా 30.76 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పట్టాలను పంపిణీ చేస్తుంది జగన్ ప్రభుత్వం. మొత్తం 28.3 లక్షల ఇళ్ళ నిర్మాణంలో భాగంగా మొదటి దశలో 15.6 లక్షల ఇళ్ళ నిర్మాణ ప్రక్రియకు చర్యలు చేపట్టింది వైసీపీ ప్రభుత్వం అలాగే 2.62 లక్షల టిడ్కో ఇళ్ళకు సేల్ అగ్రిమెంట్లను కూడా అందించారు. ఉచితంగా స్థలాలు అందించే చోట 6,800 కోట్ల వ్యయంతో త్రాగునీరు, డ్రైనేజీ , రోడ్లు , విద్యుత్ వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వాలు చెప్పిన ఇంటి సైజు 224 చదరపు అడుగుల కన్న ఎక్కువగా 340 చదరపు అడుగులు పెంచి గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలాన్ని , పట్టణ ప్రాంతంలో 1 సెంటు స్థలాన్ని పేద మహిళలకు ప్రభుత్వం అందించింది.

రాష్ట్రంలో పేదలందరికి శాశ్వత గృహాన్ని అందించాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం చేపడితే ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పలు కేసులు వేయించి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే ప్రభుత్వం చూపిన చిత్తశుద్ది ముందు అవి విఫలం అవ్వడంతో పేద వాడి ఇంటి విస్థరణపై హేళన గా మాట్లాడుతూ ఆ ఇళ్ల స్థలాలను మరుగుదొడ్లతోనూ , కుక్కల దొడ్లతోనూ పోల్చి పేద మహిళల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేశారు . ఇది ఇలా ఉంటే సీపీఐ నేత నారాయణ సైతం తెలుగుదేశం పలుకులే పలికారు కానీ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రంలో ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఎంత విస్తీర్ణంలో ఇచ్చారు అనే లెక్క చెప్పే దైర్యం చేయలేకపోవడం వారి చిత్తశుద్ధి లోపంగా పరిగణించవచ్చు .

ఇక తాజాగా బీజేపీకి చెందిన విష్ణు వర్ధన్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సెంటున్నర స్థలంలో ఇళ్ళు అంటే బాత్రూం అంత ఉంటుంది అని ఒక ప్రముఖ చానల్ లో జరిగిన చర్చ సందర్భంగా వాఖ్యానించారు. అయితే రాష్ట్ర బీజేపి నేత ఈ వివాదాస్పద కామెంట్స్ చేసి 24 గంటలు గడవక ముందే పరిస్థితి బూమరాంగ్ అయినట్టుగా కనిపిస్తుంది. సాక్షాత్తు ప్రధాన మంత్రే సెంటున్నర ఇంటిపై ప్రశంసలు కురిపిస్తూ అవార్డులను ఇస్తున్న ఈ సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి ఇస్తున్న ఇళ్ల పై చేసిన వాఖ్యలకు కట్టుబడి ఉంటారా లేక నాలిక కరుచుకొని తమ పాత వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోలేక మౌనం వహిస్తారో చూడాలి . ఇహ వైసీపీ ఇచ్చిన ఇళ్ల స్థలాల పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలు తమ హయాంలో కేంద్ర నిధులతో నిర్మించిన సెంటున్నర ఇంటికి ప్రధాని ఇస్తున్న అవార్డుని కూడా విమర్శిస్తారో లేదో వేచి చూడాలి .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి