విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెం, బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి, మృతి చెందిన కేసులో, సంచలనాత్మక విషయాలు బైటకొచ్చాయి. ఆమె మృతిదేహానికి, కేజీహెచ్‌లో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, రిపోర్టు పోలీసులకు అందింది. సృజన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోవడానికి కారణం పాయిజన్ తీసుకోవడమేనని వైద్యులు నిర్దారించారని పోలీసులు చెప్పారు. పెళ్లికి ముందు విషాన్ని ఎందుకు తీసుకుంది? కారణాలు ఏంటి? పెళ్లి ఇష్టంలేదా? బుధవారం రాత్రి నాగోతి శివాజీ, సృజనల […]