తెలుగుదేశంలో ఉండగా జనంలోకి వెళ్లడానికి జంకేవారు. అధినేత చంద్రబాబు నాయుడి ప్రకటనలు, అవలంబిస్తున్న తీరుతో స్థానికంగా ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కు ఆ ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి. విశాఖ ను రాజధానిగా చంద్రబాబు వ్యతిరేకిస్తూ ప్రకటనలు ఇవ్వడం, జూమ్ మీటింగ్ లు పెట్టడం తో ఆయన స్థానిక ప్రజల నుంచి ఆగ్రహానికి గురయ్యే వారు. దీంతో నియోజకవర్గంలో తిరగడానికి సంశయించేవారు. దాదాపు 15 నెలల పాటు ఆయన ఈ నరకయాతన అనుభవించినట్లు […]