కొడుకుకి పెళ్లై ఆరేళ్లయింది. ఇంకా పిల్లల్ని కనలేదు. మాకు మనమడో, మనమరాలో కావాలంటూ తల్లిదండ్రులు ఉత్తరాఖండ్ లో కోర్టును ఆశ్రయించారు. ఏడాదిలోగా కనివ్వాలి. ఆ బాధ్యతను నెరవేర్చకలేకపోతే రూ.5 కోట్ల పరిహారం ఇవ్వాలన్నది వాళ్ల డిమాండ్. కొడుకుని కని, పెంచి, చదివించి, అట్టహాసంగా పెళ్లి చేసేందుకు, తమ సంపాదన మొత్తాన్ని ఖర్చు చేశామని సంజీవ్ (61), సాధనా ప్రసాద్ (57) చెప్తున్నారు. 2006లో కొడుకు శ్రేయాసాగర్ (35) కు పైలట్ శిక్షణ కోసం అమెరికా పంపించేందుకు రూ.50లక్షలు […]