ప్రస్తుత పరిణామాలు గమనిస్తే టీడీపీ లో పలువురు సీనియర్ నేతలు బాబు తరహాలో అధికార పక్షం పై విమర్శలు చేయటానికి ఇష్టపడట్లేదు అనే చెప్పొచ్చు . టీడీపీ అధికారంలో ఉండగా వైసీపీ పై తీవ్ర స్వరంతో విమర్శలు చేసిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులు నేడు కనీసం ప్రెస్ ముందుకు రావడానికి కూడా ఇష్టపడుతున్నట్లు లేదు . టీడీపీ పార్టీ స్థాపించిన తర్వాత ఊహించని స్థాయి ఓటమి గత ఎన్నికల్లో ఎదురైంది . బాబు మంత్రి వర్గంలో […]
ప్రభుత్వం పై ఎప్పటిలానే నిరాధార ఆరోపణలు వెనకా ముందు చూడకుండా తనకు నోటికి ఏది అనిపిస్తే అది మాట్లాడడంలో టిడిపి ఎమ్మేల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ముందుంటారు. గతంలో టిడిపి హయాంలో మంత్రిగా ఉన్నపుడు కూడా ఆయన ప్రతిపక్షం మీద ఇష్టానుసారం విరుచుకుపడేవారు.. అధికారం పోయాక కూడా కొన్నాళ్ళు అదే నోటిదురుసుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద, మంత్రుల మీద కామెంట్స్ చేసేవారు.అయితే ఆ తరువాత ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల కొనుగోలు విషయంలో ఆయన కార్మికమంత్రిగా […]
ఎలక్షన్ కమిషనర్ కేంద్రానికి రాసిన లేఖ ఆధారంగా ఆర్టికల్ 356 కింద ఈ రాష్ట్రప్రభుత్వాన్ని వెంటనే రద్దు చెయ్యాలని అచ్చెం నాయుడు నాయుడు ఆరోపించడం చూస్తుంటే.. ముందు అసలు నిజంగా ఎన్నికల కమిషనర్ ఆ లేఖ రాశాడా లేదా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే.. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చెయ్యడం.. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అంటే మరి అంత సులువా ?? ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కుప్పకూల్చడం అంటే అదేమైనా అధికారులను […]
తంతే గారెల బుట్టలో పడటం అంటే ఇదే… ఎన్నికల్లో ఓడిపోతే మంత్రి పదవులు వొచ్చాయి… శాసనమండలి రద్దయితే ఏకంగా రాజ్యసభ స్థానం దక్కింది…. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన చిదంబరం,అరుణ్ జైట్లీ లాంటి నాయకులకు కేంద్రంలో మంత్రిపదవులు అనేకసార్లు వొచ్చాయి కానీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులకు రాష్ట్రంలో మంత్రిపదవులు రావటం చాలా అరుదు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి ఒకరిద్దరు నాయకులకు ఓడిపోయిన సంవత్సరానికో, రెండేళ్లకో మంత్రి పదవులు వొచ్చాయి. కానీ మొన్నటి ఎన్నికల్లో వైసీపీ […]
ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో ఈ రోజు ఆయన పర్యటనను అడ్డుకుంటామని వైసిపి కార్యకర్తలు పిలుపునిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ని అడ్డుకొని ఆయనకు తమ నిరసనను తెలియజేయడానికి ఈ ఉదయమే వైసిపి కార్యకర్తలు, మూడురాజధానులకు అనుకూలంగా ఉన్న ప్రజలు, మహిళలు భారీగా ఎయిర్పోర్ట్ కి […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రివర్స్ స్వింగ్ కనిపిస్తోంది. సహజంగా అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటాయి.. పాలకపక్షాలు జాప్యం చేస్తుంటాయి. కానీ ఏపీలో మాత్రం అధికార పక్షం విచారణల పర్వం కొనసాగిస్తోంది. విపక్షం దానిని తప్పుబడుతోంది. కక్ష సాధింపు చర్యగా వర్ణిస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. గత ప్రభుత్వ విధానాలపై గంపగుత్తగా దర్యాప్తు సాగించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడంతో కలకలం సాగుతోంది. చివరకు ఎటు మళ్లుతుందోనననే ఉత్కంఠ కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో […]
ట్విట్టర్ చాలా మంది నాయకులు, సెలబ్రిటీలు తమ అభిమానులతో అనుసంధానం కావడానికి ఉపయోగపడుతోంది. అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధాని ట్విట్టర్ అకౌంట్లకి లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. నరేంద్ర మోడీ తను ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండటమే కాక తన సహచరులను కూడా ట్విట్టర్ లో చురుగ్గా ఉండమని ప్రోత్సహించారు. కొన్ని సందర్భాల్లో ట్విట్టర్ నిజంగానే ఉపయోగకరం అయింది. ట్రెయిన్ బోగీలో ఒంటరిగా ఉన్న మహిళ కొంతమంది ఆకతాయిలు ఆ బోగీలో ఎక్కి తనను వేధిస్తుంటే, […]
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల ముసుగులో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆస్పత్రుల్లో భారీగా దోపిడీ జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టింది. మొత్తంగా రూ. 151 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. అయితే చంద్రబాబు మాత్రం బీసీలు కాబట్టి వారిని టార్గెట్ చేశారని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆయన […]
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయడుకు వస్తున్న ప్రజాధారణ ఓర్వలేకే ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌పై విరుచుపడ్డారు. బీసీల ఎదుగుదల చూసి జగన్‌కు కడుపు మంట.. అంటూ కూడా తనదైన శైలితో ఫైర్ అయ్యారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల, వైద్య పరికరాల కొనుగోళ్లలో 151 కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుదే కీలక […]
చంద్రబాబు మరోసారి పేలవంగా ప్రతిస్పందించారు. కీలక విషయంలో ఆయన స్పందన చివరకు పార్టీ శ్రేణులకు కూడా మింగుడుపడేలా లేదు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నేటికీ తన తొలినాళ్ల నాటి రాజకీయ ఎత్తుగడలు వేయడానికి సిద్ధపడడం విస్మయకరంగా మారింది. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యన్నారాయణ పాత్రను ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిర్ధారించారు. పైగా దానికి ఆధారాలుగా ఉన్న ఆయా మంత్రుల లేఖలను కూడా బహిరంగపరిచారు. దాంతో […]