ఈఎస్ఐ స్కామ్‌లో టెక్కలి ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అచ్చెన్న అరెస్టుకు ప్రతిస్పందనగా టీడీపీ బీసీలపై దాడి, కక్ష సాధింపు అంటూ కులరాజకీయాలకు తెరలేపడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి, చరిత్రకు భిన్నంగా జనరల్ స్థానాల్లో బీసీలను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా నిలబెట్టి, గెలిపించుకున్న వైఎస్సార్సీపీకి బీసీలపై కక్షెందుకు ఉంటుందో టీడీపీయే చెప్పాలంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉత్తర్రాంధ్ర ఏం చెప్తోంది….? ఉత్తరాంధ్రలో బీసీలు […]
సాధారణంగా మీడియాకు అనేక సందర్భాల్లో ఆత్రుత ఎక్కువ. ముఖ్యంగా ఓ వర్గం మీడియాకు మరీ ఎక్కువ. ఒకరి/ఒక పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఇలా.. వీరు ఇలా.. అంటూ ఊహాజనిత కథనాలు ప్రచురించడం/ప్రసారం చేయడం, అది నిజమైతే మేం ముందే చెప్పాం అంటూ రోజు మొత్తం బ్రేకింగ్‌లు పెట్టడం, నిజం కాకపోతే కనీసం ఖండన కూడా చెప్పకుండా గమ్మున ఉండిపోవడం ఆ మీడియాకు అలవాటు. రాజకీయ వార్తల విషయంలో ఇది మరీ ఎక్కువ. ఫిరాయింపుల విషయమే […]
విభజనకు ముందున్న 23 జిల్లాలు కావొచ్చు, విడిపోయాక ఉన్న 13 జిల్లాలే కావొచ్చు.. కానీ రాష్ట్రంలో రాజకీయాధికారం పొందాలంటే ఉభయగోదావరి జిల్లాల ప్రజల ఆశీస్సులు ఉండాలన్నది రాజకీయ నమ్మకం. ఇప్పటి వరకు కూడా ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ రెండు జిల్లాల్లోనూ ఆధిక్యం చాటుకున్న పార్టీలే రాష్ట్రంలో అధికారం పీఠమెక్కడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఇదే విధమైన సెంటిమెంట్‌ను ఈ రెండు జిల్లాలు నిలుపుకున్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా […]
కరోనా వేళ భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా నివారణలో భాగంగా మరికొన్నాళ్ళ పాటు లాక్ డౌన్ కొనసాగించినా పెద్ద కష్టం లేకుండా గడిచిపోయే ఎగువ మధ్యతరగతి, ఆ పై వారు ఉన్నారు. కానీ దిగువ మధ్యతరగతి, నిరుపేదలు మాత్రం ఇప్పటికే అల్లాడిపోతున్నారు. 40 రోజుల పాటు ఉపాధికి గండిపడడంతో రోజు గడవడమే గగనంగా మారిన వారున్నారు. దేశంలో అత్యధికులు అసంఘటితరంగ కార్మికులుగా ఉన్న దశలో వారి జీవనం అస్తవ్యస్తంగా మారింది. అలాంటి వారిని ఆదుకునే ఆపన్నహస్తాలే ఇప్పుడు […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఉచ్చు బిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘర్షణలు, ఏకగ్రీవాలపై అభ్యంతరకర రీతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో కేంద్ర ప్రభుత్వానికి లేఖరాశారు. దాంతో పాటు తన ప్రాణానికి హాని ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. అయితే లేఖ పై అప్పట్లో కమిషనర్ గా […]
ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కరోనా కంటే తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. లాక్ డౌన్ వేళ కూడా ఆయా పార్టీల మధ్య వాదోపవాదనలు చల్లారడం లేదు. సంచలన ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆగడం లేదు. అందులోనూ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి సహా ఆపార్టీ పెద్దల దూకుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. కన్నా లక్ష్మీనారాయణకు కాకపుట్టిస్తోంది. ముఖ్యంగా కన్నామీద గురిపెట్టి ఆయన గుట్టు రట్టు చేసే రీతిలో విజయసాయిరెడ్డి ప్రారంభించిన విమర్శలు వేడిపుట్టిస్తున్న తీరు విశేషంగా మారుతోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు […]
చంద్రబాబు పరిస్థితి రానురాను అగమ్యగోచరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన మాటల తీరుని బట్టి అలాంటి అనుమానమే వస్తోంది. అంతటి అనుభవజ్ఞుడు కూడా రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి భయాందోళనలు రేకెత్తించడం విస్మయకరంగా మారుతోంది. ప్రజలకోసం జీవితాన్ని అంకితం చేసానని చెప్పుకునే చంద్రబాబు చివరకు ఇంత కష్టకాలంలో కూడా టీడీపీ నేతలను సహాయక కార్యక్రమాలు చేపట్టాలని మాత్రం పిలుపునివ్వలేదు. పైగా నిరాహారదీక్షలు చేయండి, ఆందోళనలు చేయండి అంటూ పిలుపునిచ్చి ఆశ్చర్యపరిచారు. రాజకీయంగా జగన్ పాలనలో ఉన్న రాష్ట్రం […]
వైఎస్ విజయమ్మ. ఓ మహిళగా అష్టకష్టాలు పడి నిలదొక్కుకున్న నాయకురాలు. ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యగానే కాకుండా ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో ఓ పార్టీకి శాసనసభాపక్ష నేతగా కూడా ఆమె వ్యవహరించారు. వైఎస్సార్ హయంలో పెద్దగా తెరమీద కనిపించని విజయమ్మ ఆ తర్వాత అనేక కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా భర్త మరణం తర్వాత తనయుడికి తానే తోడయ్యారు. పులివెందుల ఎమ్మెల్యేగానూ, వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో ఎల్పీ లీడర్ గానూ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలి […]
ఇలాంటి సందేహమే కలుగుతుంది. మాజీ ఎన్నికల అధికారి అనుకోని వ్యవహారంలో తలదూర్చారు. ఆలశ్యంగా అయినా దానిని వైఎస్సార్సీపీ తెరమీదకు తీసుకురావడంతో ఇది పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు తమకు సంబంధం లేదని తేల్చేశారు. దాంతో చివరకు అనివార్యంగా మాజీ ఎస్ ఈ సీ మళ్ళీ సీన్ లోకి వచ్చారు. సుమారుగా 20 రోజుల తర్వాత తన లేఖపై స్పష్టత ఇచ్చారు. దాంతో ఇన్నాళ్లుగా ఎందుకు దాచిపెట్టారనే సందేహాలు మొదలయ్యాయి. ఏపీలో స్థానిక ఎన్నికల […]
ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియా వేదికల్లో చురుకుగా వ్యవహరించే వైయస్సార్సీపి ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డికి ఆయా సోషల్ మీడియా వేదికలలో వేధింపులు తప్పలేదు. ట్విట్టర్, ఫేస్బుక్, హలో తదితర సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టింగులు పెడుతూ తనను, తమ పార్టీని కించపరిచేలా వ్యవహరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ విజయసాయి రెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు తప్పుడు పోస్టింగులు కు సంబంధించిన ఆధారాలు, వాటి అడ్రస్ లింకులు, […]