ఇచ్చిన హామీలు, ప్రజా సంక్షేమం పట్ట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన చిత్తశుద్ధిని చాటుకుంటూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అవకాలు చవాకులు పేలినా.. వ్యతిరేక మీడియా ఎన్ని కథనాలు ప్రచురించినా వాస్తవం ప్రజలకు గుర్తిస్తారనే ఉద్దేశంతో సీఎం జగన్ తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా మద్యనిషేధంలో మరో అడుగు ముందుకు వేశారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో మరో 13 శాతం దుకాణాలు మూసివేశారు. ఫలితంగా 3500 ఉన్న దుకాణాలు […]
కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ఈ రోజు ఐదో దశలోకి చేరింది. ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ ఐదో దఫా లాక్డౌన్ కొనసాగనుంది. ఇప్పడు ఉన్న వాటితోపాటు మరిన్ని అంశాలకు లాక్డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్డౌన్న పరిమితం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జోన్ల వ్యవస్థను పూర్తిగా ఎత్తివేశారు. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్ చేస్తూ వైరస్ కట్టడికి చర్యలు […]
38 ఏళ్ల వయస్సును రాజకీయ పార్టీ, 42 ఏళ్ల రాజకీయ అనుభవంతో దేశంలోనే సీనియర్ రాజకీయ వేత్త అని చెప్పుకునే నాయకుడు ఉన్న పార్టీ, మా బలం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే అని చెప్పుకునే పార్టీ పని, ఆ నాయకుడి సత్తా అయిపోనట్లు ఆ పార్టీనేతలు గుర్తించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి బయటపడేందుకు, కార్యకర్తల సంక్షోభం నుంచి బయటపడేందుకు మోదీనే దిక్కు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిర్ణయానికి వచ్చారు. వారు రావడమే కాదు.. […]
తాజాగా భారత్‌లో కరోనా కేసుల సంఖ్య లక్షన్నరకు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే 31 తర్వాత మరో రెండు వారాల వరకు లాక్ డౌన్‌ను పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. మరో ఐదు రోజులలో మే 31 న లాక్ డౌన్ 4 .0 ముగుస్తుంది.లాక్ డౌన్ 4.0 లో కొన్ని సడలింపులు ఇచ్చిన కేంద్రం ఈసారి లాక్ డౌన్ 5.0 లో మరింత ఎక్కువగా సడలింపులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ […]
రెండు నెలల తర్వాత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి స్వరాష్ట్రానికి వచ్చారు. కాన్వాయ్‌తో రాష్ట్ర సరిహద్దుల్లో అడుగుపెట్టగానే టీడీపీ శ్రేణులు భారీగా జాతీయ రహదారిపైకి వచ్చి స్వాగతం పలికాయి. రోడ్డుపై టీడీపీ జెండాలతో వేచి ఉన్న టీడీపీ శ్రేణులను చూడగానే చంద్రబాబు కారును ఆపారు. డోర్‌పై నిలబడి తనదైన శైలిలో అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టీడీపీ కార్యకర్తలు తనకు స్వాగతం పలకడంతో బాబు […]
ఇటివలి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. దాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు రోజుల పాటు మీడియా సమావేశం పెట్టి వివరించారు. అందులో ప్రభుత్వ సంస్థల అమ్మకాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ప్రభుత్వ సంస్థల అమ్మకంపై చర్చ ఇది తొలిసారి కాదు.. మోడీ సర్కార్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ, అమ్మకంపై చర్చ జరిగింది. ఇప్పటికే నీతి ఆయోగ్ సూచన మేరకు మోడీ సర్కార్ కొన్ని సంస్థల […]
పదో తరగతి, ఇంటర్మీడియేట్ బోర్టు పరీక్షలు నిర్వహించుకునేందుకు లాక్డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దేశంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన పదో తరగతి, ఇంటర్మీడియేట్ బోర్డు పరీక్షలు లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఇటీవలి లాక్డౌన్ 3.0 ముగిసి, లాక్డౌన్ 4.0 ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తుంది. బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ప్రజా రవాణాకు అనుమతిస్తూ లాక్డౌన్ మార్గదర్శకాలను సడలించింది. అందులో భాగంగానే పదో తరగతి, ఇంటర్మీడియేట్ బోర్టు పరీక్షలు […]
2019-2020 సంవత్సరానికి 5 స్టార్ గా ఆరు నగరాలు, 3 స్టార్‌గా 65 నగరాలు, 1 స్టార్‌గా 70 నగరాలను ధృవీకరించినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో 3 స్టార్ నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు నగరాలు, 1 స్టార్ నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు నగరాలు ఉన్నాయి. ఈ రేటింగులకు సంబంధించి సవరించిన ప్రోటోకాల్‌ను కూడా మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. చెత్త రహిత హోదాను సాధించడానికి నగరాలకు ఒక యంత్రాంగాన్ని […]
ప్రజల సుఖఃదుక్కాల్లో పాలుపంచుకునేవాడే నిజమైన రాజు అంటారు. ఈ మాటను ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్షరాల నిజం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా వలస కూలీలు, కార్మికుల కష్టాలపై ముఖ్యమంత్రిగానే కాదు మనసున్న వ్యక్తిగా స్పందిస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి ఏపీ మీదుగా మరో రాష్ట్రానికి వెళ్లే వలసకూలీలు, కార్మికుల గురించి మనకెందుకులే బరువు అనుకోలేదు. బాధ్యతగా భావించి వారికి కష్టాలు తీర్చేందుకు ఏ ముఖ్యమంత్రి చేయని ఏర్పాట్లు చేస్తున్నారు. […]
సినిమా హాళ్లు తెరుచుకోవడం గురించి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ప్రస్తుతానికి లాక్ డౌన్ లో వీటికి అనుమతించే ప్రసక్తే లేదని మాత్రం తేల్చి చెబుతున్నారు. పరిశ్రమ వర్గాలు ఆగస్ట్ లేదా దసరా పండగ దాకా పరిస్థితి సాధారణం కావడం కష్టమని అంచనా వేస్తున్నాయి. ఒకవేళ థియేటర్లు తెరిచినా సవాలక్ష నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. సీట్ల మధ్య గ్యాప్, ప్రతి షోకు మధ్య ముప్పావుగంట […]