ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 193 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 5280 కు చేరిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కాగా 2851 మంది వైరస్ బారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా ఆక్టీవ్ కేసుల సంఖ్య 2341 గా నమోదయింది. కరోనా కారణంగా […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కరోనా వ్యాపించకుండా సరైన జాగ్రత్తలు తీసుకుని పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.
పాకిస్తాన్ క్రికెట్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని షాహిద్ ఆఫ్రిదినే ట్విట్టర్ ద్వారా తెలిపారు. గురువారం నుంచి తనకు అసౌకర్యంగా ఉందని చెప్పాడు. ఈ క్రమంలోనే తన శరీరంలో నొప్పులు మొదలయ్యాయని, కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తూ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. కాగా పాకిస్థాన్ లో కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న సమయంలో షాహిద్ ఆఫ్రిది ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చాడు. పేదలకు […]
కరోనా ప్రభావం వల్ల దేశవిదేశాల్లో ప్లాన్ చేసుకున్న భారతీయ చిత్రాల పరిస్థితి చాలా గందరగోళంలో పడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది . ఇప్పటికీ విదేశీ ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. బయట నుంచి ఇండియాకు రావొచ్చు కాని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళే దారి ప్రస్తుతానికి లేదు. త్వరలో వచ్చినా వీసాలకు సంబంధించి చాలా కఠినమైన నిబంధనలు ఉంటాయి. ఇవన్ని భరించి పాతిక లేదా యాభై మందితో సినిమా యూనిట్లు అంత రిస్క్ చేస్తాయా అంటే అనుమానమే. […]
పైల్స్ తో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని హాస్పిటల్ తరలించిన పోలీసులు . పరామర్శించటానికి వస్తున్న బాబు . ESI కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిర్ధారించి నిన్న ఉదయం అరెస్ట్ చేసిన మాజీ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుని రాత్రికి విజయవాడ ఏసీబీ ఆఫీసుకి తరలించడం తెలిసిందే . అయితే పైల్స్ తో బాధపడుతూ ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడుకి రక్తస్రావం కావడంతో ఏసీబీ పోలీసులు ESI హాస్పిటల్ నుండి డాక్టర్స్ ని పిలిపించడం వారు పైల్స్ పరిశీలించి రక్తస్రావం కాకుండా […]
భాగమతి వచ్చి రెండేళ్లు దాటింది. లేట్ అయితే అయ్యింది పోనీ నిశ్శబ్దం చూస్తాం కదా అనుకుంటే కరోనా లాక్ డౌన్ దెబ్బకు మళ్లీ వాయిదా పడింది. థియేటర్లో వస్తుందా లేదా ఓటిటినా అనేది ఎవరికీ తెలియదు. క్రైమ్ థ్రిల్లర్ కం హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా గత ఆరు నెలలుగా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పటికైతే సెన్సార్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. దీని సంగతలా ఉంచితే అనుష్క తర్వాత ఏ […]
కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ వల్ల పట్టణాలు, నగరాలకు కూలీ పనులు చేసేందుకు వెళ్లిన గ్రామీణ ప్రజలు తిరిగి స్వస్తలాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి గ్రామాల్లో ఉపాధి కల్పించడం ప్రభుత్వాల ముందున్న సవాల్. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది. రోజుకు సరాసరి 50 లక్షల మందికి పని కల్పిస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే జాబ్ కార్డు ఉన్న […]
ఇపుడున్న కరోనా పరిస్థితుల్లో కొత్తవాళ్లను ఎవరిని కలవలన్నా భయం వేస్తోంది. ఇక నిత్యం పదుల సంఖ్యలో అపరిచితులతో వ్యవహారాలు నడిపే సినిమా వాళ్ళ గురించి చెప్పేదేముంది. ముఖ్యంగా కొత్త కథలు వినాలన్నా దర్శకులతో ప్రాజెక్టులు కన్ఫర్మ్ చేయాలన్నా మీటింగులు తప్పనిసరి. అయితే ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఈ తతంగం నడిచేది. కానీ ఇప్పుడలా కుదరదు. ఎంత అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకున్నా ఎవరు ఎక్కడెక్కడ తిరిగి మనల్ని కలుస్తున్నారో పసిగట్టడం అసాధ్యం. అందుకే టాలీవుడ్ నిర్మాతలు కొందరు […]
కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 10 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కానీ నిన్న తొలిసారిగా 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 11,458 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 386 మరణాలు సంభవించాయి. ఇప్ప.దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య […]
ఐదు రెట్లు శక్తివంతమైన వైరస్!! దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మరి విస్తరిస్తూనే ఉంది. పెరుగుతున్న కేసులతో కల్లోలం రేపుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 3, 00, 327 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 8, 600 మంది మృతి చెందారు. చిన్నా, పెద్దా.. అందరినీ కబళిస్తోంది. డాక్టర్… యాక్టర్.., పోలిటిషియన్.. పోలీస్.. అన్ని రంగాల వారూ మహమ్మారి బారిన పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా.. తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ విజృంభిస్తూనే ఉంది. తెలంగాణలో […]