అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం.. హేజిల్ వుడ్ కు కమ్మిన్స్ కౌంటర్!

అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం.. హేజిల్ వుడ్ కు కమ్మిన్స్ కౌంటర్!

స్కాట్లాండ్ తో మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక అతడి కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చాడు సహచర బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.

స్కాట్లాండ్ తో మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక అతడి కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చాడు సహచర బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.

టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ భవితవ్యం ఆస్ట్రేలియా-స్కాట్లాండ్ మ్యాచ్ పై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ గెలిచినా.. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయినా.. ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించి, ఇంటిదారిపట్టాల్సిందే. దీంతో ఈ మ్యాచ్ కోసం ఆసీస్, స్కాట్లాండ్ అంటే ఎక్కువగా ఎదురుచూస్తోంది ఇంగ్లీష్ టీమ్. అయితే ఈ మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ చేసిన కామెంట్స్ ఒక్కసారిగా క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక అతడి కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చాడు సహచర బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.

“స్కాట్లాండ్ తో జరగబోయే మ్యాచ్ ను మేము సీరియస్ గా తీసుకోము. మా వల్ల ఇంగ్లండ్ టోర్నీ నుంచి ఇంటికి వెళ్లితే.. అది మాతో పాటుగా మిగతా జట్లకు కూడా మంచిదే. ఇంగ్లండ్ ప్రమాదకరమైన టీమ్” అని జోష్ హేజిల్ వుడ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. ఆసీస్ కావాలనే స్కాట్లాండ్ పై ఓడిపోతుందా? అన్న అనుమానాలు తలెత్తాయి. తాజాగా ఈ విషయంపై స్పందించాడు ఆ జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్.

హేజిల్ వుడ్ కామెంట్స్ పై కమ్మిన్స్ మాట్లాడుతూ..”ఇంగ్లండ్ ను టోర్నీ నుంచి పంపించడానికి మేము ఎలాంటి మాయ చేయడం లేదు. మీరు హేజిల్ వుడ్ మాటలను పట్టించుకోవద్దు. మీరు దేశం కోసం ఆడుతున్నప్పుడు మీ బెస్ట్ ను అందించాలి. అలా కాదని ఆడితే.. అది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అవుతుంది. మా జోరును రాబోయే మ్యాచ్ ల్లో కూడా కంటిన్యూ చేస్తాం. ఇకపోతే స్కాట్లాండ్ అద్భుతంగా ఆడుతోంది” అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఆసీస్ గ్రూప్ బిలో ఆడిన మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి సూపర్ 8కు అర్హత సాధించింది. ఇక ఈ గ్రూప్ లో ఉన్న ఒమన్, నమీబియా జట్లు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. మిగిలిన ఒక్క బెర్త్ కోసం స్కాట్లాండ్, ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి. అయితే నమీబియాతో జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిచి.. ఆస్ట్రేలియా చేతిలో స్కాట్లాండ్ ఓడిపోతే ఇంగ్లండ్ సూపర్ 8కు వెళ్తుంది.

Show comments