Hardik Pandya Should Play Irfan Pathan Comments: రోహిత్, కోహ్లీ కాదు.. బిగ్ మ్యాచెస్​లో భారత్​కు అతడే కీలకం: ఇర్ఫాన్ పఠాన్

రోహిత్, కోహ్లీ కాదు.. బిగ్ మ్యాచెస్​లో భారత్​కు అతడే కీలకం: ఇర్ఫాన్ పఠాన్

సూపర్-8 దశకు చేరుకున్న టీమిండియా.. తదుపరి డేంజరస్ టీమ్స్​ను ఫేస్ చేయనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ కప్పు కొట్టాలంటే అతడు రాణించాలని అన్నాడు.

సూపర్-8 దశకు చేరుకున్న టీమిండియా.. తదుపరి డేంజరస్ టీమ్స్​ను ఫేస్ చేయనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ కప్పు కొట్టాలంటే అతడు రాణించాలని అన్నాడు.

పొట్టి కప్పు ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఒకటి, రెండు మినహా దాదాపుగా గ్రూప్ దశ మ్యాచ్​లు ముగిశాయి. సూపర్-8 టీమ్స్​పై కూడా సుమారుగా క్లారిటీ వచ్చేసింది. వరుస విజయాలతో టోర్నీలో దుమ్మురేపుతున్న టీమిండియా.. నెక్స్ట్ స్టేజ్​లో ఎవరితో తలపడుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. సూపర్​-8కు చేరుకున్న రోహిత్ సేన.. ఇందులో భాగంగా ఆఫ్ఘానిస్థాన్​, ఆస్ట్రేలియాతో తాడోపేడో తేల్చుకోనుంది. అలాగే బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్​లో ఒక టీమ్​తోనూ తలపడనుంది భారత్. ఇప్పటివరకు యూఎస్​ఏలో ఆడుతూ వచ్చిన మెన్ ఇన్ బ్లూ.. ఇక మీదట కరీబియన్ దీవుల్లో ఆడనుంది. ఇంత వరకు ట్రిక్కీ పిచ్​లను ఫేస్ చేసిన టీమిండియా.. ఇక ముందు స్లో పిచ్​లు విసిరే సవాల్​ను ఎదుర్కోనుంది.

సూపర్-8 దశలో ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా లాంటి డేంజరస్ టీమ్స్​ను భారత్ ఫేస్ చేయనుంది. ఒకవేళ బంగ్లాదేశ్ కూడా క్వాలిఫై అయితే ఆ టీమ్​తోనూ తాడోపేడో తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ జట్లన్నీ వెస్టిండీస్​ పిచ్​లకు బాగా అలవాటు పడ్డాయి. ముఖ్యంగా ఆసీస్ అయితే అక్కడ చెలరేగి ఆడుతోంది. గ్లెన్ మాక్స్​వెల్ తప్పితే మిగతా ఆటగాళ్లంతా ప్రత్యర్థులతో ఆడుకుంటున్నారు. సెమీస్ చేరాలంటే కంగారూ గండాన్ని దాటాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్​రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇక మీదట రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. హార్దిక్ పాండ్యా మన జట్టుకు కీలకం కానున్నాడని అన్నాడు. బిగ్ మ్యాచెస్​లో నెగ్గాలంటే హార్దిక్ తన రియల్ టాలెంట్​ను చూపించాల్సి ఉంటుందని చెప్పాడు. మునుపటి పాండ్యాను బయటకు తీయాలని తెలిపాడు.

హార్దిక్ పాండ్యా గేర్లు మార్చాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్​లో అతడు వేగం పెంచాలి. ధనాధన్ షాట్లతో విరుచుకుపడాల్సిన సమయం వచ్చేసింది. నాకౌట్ గేమ్స్​లో హార్దిక్ విధ్వంసకంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన గ్రూప్ దశ మ్యాచుల్లో అతడు అంతగా రాణించలేదు. బౌలింగ్​లో భేష్. కానీ బ్యాటింగ్​లో మాత్రం తడాఖా చూపించలేదు. కాబట్టి పాండ్యా గాడిన పడాలి. నాకౌట్ గేమ్స్​లో నెగ్గాలంటే పాండ్యా రాణించాల్సిన ఆవశ్యకత ఉంది. అతడు మరింత ఎఫెక్టివ్​గా బౌలింగ్ చేస్తే ప్లేయింగ్ ఎలెవన్​లో కుల్దీప్ యాదవ్​ను తీసుకోవచ్చు. అతడు వేసే లెంగ్త్​ విండీస్ పిచ్​లకు బాగా సెట్ అవుతాయి. అతడి కట్టర్స్, స్లో బౌన్సర్స్ ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు అంత ఈజీ కాదు’ అని పఠాన్ పేర్కొన్నాడు. మరి.. హార్దిక్ చాలా కీలకమంటూ పఠాన్ చేసిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.

Show comments