Gautam Gambhir On Yoyo Test And Team India: ఆ రూల్ దండగ.. టాలెంట్​ను తొక్కేస్తున్నారంటూ గంభీర్ సీరియస్!

ఆ రూల్ దండగ.. టాలెంట్​ను తొక్కేస్తున్నారంటూ గంభీర్ సీరియస్!

ఆ రూల్ వేస్ట్ అంటూ టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలాంటి వాటితో టాలెంట్​ను తొక్కేస్తున్నారంటూ సీరియస్ అయ్యాడు.

ఆ రూల్ వేస్ట్ అంటూ టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలాంటి వాటితో టాలెంట్​ను తొక్కేస్తున్నారంటూ సీరియస్ అయ్యాడు.

టీమిండియా కొత్త కోచ్ రేసులో లెజెండ్ గౌతం గంభీర్ పేరు జోరుగా వినిపిస్తోంది. రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి విదేశీ ప్లేయర్ల పేర్లు కూడా నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ఐపీఎల్-2024 ఫైనల్ తర్వాత కేకేఆర్ మెంటార్​గా ఉన్న గంభీర్​ను బీసీసీఐ సెక్రెటరీ జైషా కలవడం, అనంతరం ఓ ఇంటర్వ్యూలో కోచ్​గా రావడం తనకు ఇష్టమేనని గౌతీ చెప్పడంతో అతడి పేరు అందరి కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తే గానీ ఏదీ చెప్పలేం. ఈ తరుణంలో భారత జట్టు ఎంపిక గురించి గంభీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా సెలెక్షన్​కు సంబంధించి ఆ రూల్​ దండగ అంటూ సీరియస్ అయ్యాడు. దాని వల్ల టాలెంటెడ్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని అన్నాడు. తీసిపారేస్తే బెటర్ అని సూచించాడు.

భారత జట్టు సెలెక్షన్ సమయంలో ఆటగాళ్లకు యోయో టెస్ట్​ను నిర్వహిస్తారనేది తెలిసిందే. ప్లేయర్ల ఫిట్​నెస్​కు ఈ పరీక్షను కొలమానంగా భావిస్తారు. ఇందులో పాసైన క్రికెటర్లను టీమిండియాలోకి తీసుకుంటారు. అయితే దీనిపై గతంలో పలు విమర్శలు వచ్చాయి. క్రికెట్​లో ఆటగాళ్ల ఫిట్​నెస్​ కంటే ప్రతిభను కొలమానంగా తీసుకోవాలనే వ్యాఖ్యలు వినిపించాయి. తాజాగా కోచ్ రేసులో ఉన్న గంభీర్ కూడా ఇదే తరహా కామెంట్స్ చేశాడు. యోయో టెస్ట్ దండగ అన్నాడు గౌతీ. దీని వల్ల టాలెంటెడ్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని సీరియస్ అయ్యాడు. ప్రతిభ కంటే ఫిట్​నెస్​ ముఖ్యమేమీ కాదన్నాడు. యోయో టెస్ట్ అక్కర్లేదని చెప్పడానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మే బెస్ట్ ఎగ్జాంపుల్ అని గంభీర్ పేర్కొన్నాడు.

‘యోయో టెస్ట్​ను సాకుగా చూపించి ప్రతిభ కలిగిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోకపోవడం కరెక్ట్ కాదు. ఏ ప్లేయర్​ను అయినా వాళ్ల టాలెంట్​ను బట్టే సెలెక్ట్ చేయాలి. వాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ స్కిల్స్ ఆధారంగా ఛాన్స్ ఇవ్వాలి. యోయో టెస్ట్ అక్కర్లేదని చెప్పడానికి రోహిత్ శర్మ మంచి ఉదాహరణ. ఫిట్​నెస్​ ముఖ్యమే. కానీ ఫిట్​గా ఉన్నామా లేదా అని చెప్పడానికి ఫిట్​నెస్​ టెస్ట్​లో క్వాలిఫై అవ్వాలనే రూల్ అనవసరం. ఎందుకంటే కొందరు ప్లేయర్లు ఫిజికల్​గా స్ట్రాంగ్​గా ఉంటారు. వాళ్లలో ఎండ్యూరెన్స్ ఉంటుంది. కానీ వాళ్లు జిమ్​లో బరువులు ఎత్తలేరు. అంతమాత్రాన ఫిట్​గా లేరంటే ఎలా? ఆటగాళ్ల ఫిట్​నెస్​ను తేల్చాల్సింది ట్రెయినర్లు మాత్రమే.. యోయో టెస్ట్ కాదు’ అని గంభీర్ స్పష్టం చేశాడు. ప్లేయర్ల బ్యాటింగ్, బౌలింగ్ స్కిల్స్​ను బట్టి టీమ్​లోకి తీసుకోవాలని.. ఇలాంటి టెస్టులను తీసిపారేయాలని పేర్కొన్నాడు. మరి.. యోయో టెస్ట్ వేస్ట్ అంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments