BAN vs NED: రాకాసి బౌన్సర్.. కళ్లు తేలేసిన బంగ్లా బ్యాటర్! వీడియో వైరల్..

BAN vs NED: రాకాసి బౌన్సర్.. కళ్లు తేలేసిన బంగ్లా బ్యాటర్! వీడియో వైరల్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. డచ్ బౌలర్ సంధించిన ఓ డెడ్లీ బౌన్సర్ కు బంగ్లా ఓపెనర్ కళ్లు తేలేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. డచ్ బౌలర్ సంధించిన ఓ డెడ్లీ బౌన్సర్ కు బంగ్లా ఓపెనర్ కళ్లు తేలేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

టీ20 వరల్డ్ కప్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో బంగ్లాదేశ్ సత్తా చాటింది. గురువారం జరిగిన గ్రూప్-డి మ్యాచ్ లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై అద్భుత విజయం సాధించింది. సీనియర్ ప్లేయర్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ అర్ధశతకంతో గెలుపులో ముఖ్యపాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓ పెను ప్రమాదం తప్పింది. డచ్ బౌలర్ వేసిన ఓ రాకాసి బౌన్సర్ కు బంగ్లా ఓపెనర్ తంజిద్ కళ్లు తేలేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా గురువారం జరిగిన బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మ్యాచ్ లో ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాకు ఆదిలోనే షాకిచ్చాడు డచ్ బౌలర్ ఆర్యన్ దత్. తన వరుస ఓవర్లలో కెప్టెన్ షాంటో(1), లిట్టన్ దాస్(1)లను పెవిలియన్ కు పంపాడు. దీంతో 23 రన్స్ కే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది బంగ్లా. ఇక మరో ఎండ్ లో ఓపెనర్ తంజిద్ హసన్  స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 3వ ఓవర్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్లో ఏం జరిగిందంటే?

నెదర్లాండ్స్ వివియన్ కింగ్మా ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఈ ఓవర్లో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు బంగ్లా ఓపెనర్ తంజిద్ హసన్. డచ్ పేసర్ కింగ్మా సంధించిన  నాలుగో బంతి రాకాసి బౌన్సర్ గా తంజిద్ మీదకి దూసుకెళ్లింది. ఆ బౌన్సర్ ను ఎదుర్కొనే క్రమంలో భారీ షాట్ కు ప్రయత్నించిన అతడు అపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ డెడ్లి బౌన్సర్ సరాసరి తంజిద్ హెల్మెట్ గ్రిల్ కు తాకి అందులోనే చిక్కుకుంది. దాంతో కాసేపు అతడికి ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఆ తర్వాత చూస్తే.. బాల్ హెల్మెట్ లో చిక్కుకుని ఉంది. ఒకవేళ బంతి ఇంకాస్త వేగంగా వస్తే.. గ్రిల్స్ నుంచి దూసుకెళ్లేదే అంటున్నారు నెటిజన్లు. దాంతో అతడి కంటికి పెద్దగాయంతో పాటుగా ప్రాణాపాయం కూడా జరిగి ఉండేదని అంటున్నారు.

ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ 46 బంతుల్లో 9 ఫోర్లతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం 160 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఓవర్లు మెుత్తం ఆడి 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులకు పరిమితం అయ్యింది. రిషద్ హోసెన్ 3 వికెట్లతో రాణించాడు.

Show comments