ప్రభుదేవ మూవీలో సన్నీ లియోన్ ఐటెం సాంగ్! థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

ప్రభుదేవ మూవీలో సన్నీ లియోన్ ఐటెం సాంగ్! థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ న్యూస్ షేక్ చేస్తోంది. అదేంటంటే? ప్రభుదేవ నెక్ట్స్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ న్యూస్ షేక్ చేస్తోంది. అదేంటంటే? ప్రభుదేవ నెక్ట్స్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

సినిమాల్లో ఐటెమ్, స్పెషల్ సాంగ్స్ కు ప్రత్యేక క్రేజ్, ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక్క ఐటెం సాంగ్ తో మూవీ రేంజ్ మారిపోయిన సినిమాలు కూడా పరిశ్రమలో ఉన్నాయి. కొంత మంది ప్రేక్షకులు కేవలం ఐటెం సాంగ్ ల కోసమే థియేటర్లకు వెళ్లేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీని ఓ న్యూస్ షేక్ చేస్తోంది. అదేంటంటే? ప్రభుదేవ నెక్ట్స్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రభుదేవ.. ఇండియన్ మైఖెల్ జాక్సన్ గా ముద్ర వేసుకున్నాడు. హీరోగా, కొరియోగ్రాఫర్ గా, డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నటనపైనే దృష్టి పెట్టిన ప్రభుదేవ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. దళపతి విజయ్ నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘గోట్’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇతడు నటిస్తున్న సినిమాల్లో ఒకటి ‘జాలియో జింఖానా’ ఒకటి. డైరెక్టర్ శక్తి చిదంబరం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. మడోనా సెబస్టియన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరో మూవీ ‘పేటరాప్’. ఎస్ జే శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వేదిక ప్రభుదేవ పక్కన చిందులేయనుంది.

ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ లో ఆడిపాడనుంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుదేవ స్టెప్పులకు సన్నీ లియోన్ అందాలు తోడైతే థియేటర్ దద్దరిల్లాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు. ఈ కాంబోను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూడలని ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇంతకు ముందు కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి మళ్లీ కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రానికి ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సాంగ్ కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు? ఏ రేంజ్ లో ఈ ఐటెం సాంగ్ ఉంటుందని భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments