'హరోం హర'కు షాకింగ్ కలెక్షన్లు.. సుధీర్ బాబు తొలి రోజు ఎంత రాబట్టాడంటే?

‘హరోం హర’కు షాకింగ్ కలెక్షన్లు.. సుధీర్ బాబు తొలి రోజు ఎంత రాబట్టాడంటే?

Harom Hara movie Day 1 Collections: నవ దళపతి సుధీర్ బాబు-జ్ఞానసాగర్ ద్వారక కాంబినేషన్ లో వచ్చిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ 'హరోం హర'. పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసుకుందాం.

Harom Hara movie Day 1 Collections: నవ దళపతి సుధీర్ బాబు-జ్ఞానసాగర్ ద్వారక కాంబినేషన్ లో వచ్చిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ 'హరోం హర'. పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసుకుందాం.

నవ దళపతి సుధీర్ బాబు-జ్ఞానసాగర్ ద్వారక కాంబినేషన్ లో వచ్చిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ ‘హరోం హర’. గన్స్ డీలింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. సుధీర్ బాబు మాస్ యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఈ చిత్రానికి తొలి రోజు ఊహించని కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. మరి తొలి రోజు సుధీర్ బాబు ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం పదండి.

సుధీర్ బాబు లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘హరోం హర’.  కప్పం ప్రాంతంలో జరిగే గన్స్ మాఫియా దందా నేపథ్యంలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక ఈ మూవీని తెరకెక్కించాడు. దర్శకుడు తన ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీలో సునీల్, మాళవిక శర్మ, జయ ప్రకాశ్, రవికాలే, అర్జున్ గౌడ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. ట్రైలర్ తోనే అంచనాలను పెంచేసిన ఈ మూవీ ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

హరోం హర మూవీ రూ. 12 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి పెయిడ్ ప్రీమియర్ల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. దాదాపు హైదరాబాద్ లో అన్నీ స్క్రీన్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లు నమోదు అయ్యాయి. బుక్ మై షోలో 93, పేటీఎంలో 91 శాతం రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ఓవరాల్ గా 40 శాతం ఆక్యూపెన్సీ నమోదు అయినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 50 లక్షలు నికరంగా.. ఒక కోటి రూపాయల గ్రాస్, ఇక ఓవర్సీస్ లో రూ. 50 లక్షల గ్రాస్ వసూల్ అయినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా హరోం హర మూవీ రూ. 1.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మూవీ టాక్, రెస్పాన్స్ పరంగా చూస్తే.. ఇవి తక్కువ కలెక్షన్లు అనే చెప్పాలి. కానీ.. మూవీకి పాజిటీవ్ టాక్ రావడం, వీకెండ్ కావడంతో.. కలెక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హరోం హర ఫస్ట్ డే కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments