Star Choreographer Earned More Than Shahruk: షారుక్ ఖాన్ కంటే తానే ఎక్కువ సంపాదించానంటున్న కొరియోగ్రాఫర్!

షారుక్ ఖాన్ కంటే తానే ఎక్కువ సంపాదించానంటున్న కొరియోగ్రాఫర్!

Star Choreographer Reveals She Earned More Than Shahruk Khan: బాలీవుడ్ బాద్ షా ఒక్క యాడ్ చేస్తేనే కోట్లలో ఛార్జ్ చేస్తాడు. ఇంక సినిమాలు అంటే చెప్పాల్సిన పనిలేదు. అయితే షారుక్ ఖాన్ కంటే తానే ఎక్కువ సంపాదించాను అంటూ స్టార్ కొరియోగ్రాఫర్ కామెంట్స్ చేసింది.

Star Choreographer Reveals She Earned More Than Shahruk Khan: బాలీవుడ్ బాద్ షా ఒక్క యాడ్ చేస్తేనే కోట్లలో ఛార్జ్ చేస్తాడు. ఇంక సినిమాలు అంటే చెప్పాల్సిన పనిలేదు. అయితే షారుక్ ఖాన్ కంటే తానే ఎక్కువ సంపాదించాను అంటూ స్టార్ కొరియోగ్రాఫర్ కామెంట్స్ చేసింది.

బాలీవుడ్ బాద్ షా.. కింగ్ ఖాన్ షారుక్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కటిక పేదరికం నుంచి కోట్లకు పడగలు ఎత్తిన ఒక స్టార్ హీరో. ఈయన సినిమా చేస్తే కోట్లకు కోట్లు కలెషన్స్ వస్తాయి. ఒక్క యాడ్ చేస్తేనే కోట్లలో ఛార్జ్ చేస్తాడు. పైగా షారుక్ ఏ చిన్న పని చేయాలి అన్నా కూడా కచ్చితంగా ఫీజు చెల్లించాల్సిందే. ఆ విషయాన్ని నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తాడు. అయితే ఇంతటి కింగ్ ఖాన్ కంటే తానే ఎక్కువ సంపాదించాను అంటూ ఒక స్టార్ కొరియోగ్రాఫర్ కామెంట్ చేయడం ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అలా ఎలా జరిగిందో కూడా చెప్పుకొచ్చింది.

సాధారణంగా బాలీవుడ్ లో షారుక్ ఖాన్ కొన్నేళ్లుగా మంచి డిమాండ్ ఉంది. షారుక్ సినిమా అంటే హిట్టు పక్కా అనే బిరుదు కూడా ఉంది. అయితే ఏ యాక్టర్ అయినా కూడా తన కెరీర్ ని మాత్రం చాలా చిన్న రోల్ తోనో.. చిన్న పారితోషకంతోనూ స్టార్ట్ చేస్తారు. అలాగే షారుక్ కూడా స్టార్ట్ చేశాడు. ఆ మూవీ సమయంలోనే హీరో కంటే కూడా తానే ఎక్కువ సంపాదించాను అంటూ ఆ స్టార్ కొరియోగ్రాఫర్ చెప్పుకొచ్చింది. అప్పట్లో షారుక్ తో తన వర్కింగ్ ఎక్స్ పీరియన్స్, వారి స్నేహం ఎలా స్టార్ట్ అయ్యింది అనే విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ సినిమాకి షారుక్ కు రూ.25 వేలు రెమ్యునరేషన్ ఇస్తే.. ఆ కొరియోగ్రాఫర్ మాత్రం రూ.30 వేలు సంపాదించింది.

ఇప్పుడు చెప్పుకుంటున్న ఆ స్టార్ కొరియోగ్రాఫర్ మరెవరో కాదు.. ఫరా ఖాన్. ఈమె గురించి పాన్ ఇండియాలో ఉన్న సినిమా లవర్స్ కి చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మార్క్ తో ఒక స్టార్ కొరియోగ్రాఫర్ రేంజ్ కి వెళ్లింది. పలు డాన్స్ షోస్ కి కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది. షారుక్ ఖాన్ కబీ హా కబీ నా మూవీతో షారుక్ తన కెరీర్ ని ప్రారంభించాడు. ఆ మూవీలో షారుక్ ఖాన్ కు ఇచ్చిన పారితోషకం రూ.25 వేలు అంట. అయితే ఫరా ఖాన్ కి మాత్రం పాటకు రూ.5 వేలు ఇచ్చారు. అయితే ఆమె ఆ సినిమాలో ఆరు పాటలు చేసింది. అంటే కొరియోగ్రాఫర్ గా ఆమెకు రూ.30 వేల రెమ్యూనరేషన్ దక్కింది.

ఆ రోజుల్లో ఆమెకు అసిస్టెంట్లు కూడా లేరు. కాబట్టి మొత్తం డబ్బు ఆమెకే దక్కింది. ఆ విధంగా షారుక్ కంటే తానే ఎక్కువ సంపాదించాను అంటూ ఫరా ఖాన్ వ్యాఖ్యానించింది. ఆ సినిమా నుంచే వీళ్లిద్దరి ఫ్రెండ్ షిప్ కూడా బిల్డ్ అయ్యింది. ఆ తర్వాత ఫరా ఖాన్ డైరెక్షన్ లో షారుక్ ఖాన్ మై హూనా, ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూఇయర్ మూవీస్లో కూడా యాక్ట్ చేశాడు. షారుక్ ఖాన్ కంటే తానే ఎక్కువ సంపాదించాను అంటూ ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి.. ఫరాఖాన్ పంచుకున్న అప్పటి పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments